Unknown Facts about Political Carrier Of Yeddyurappa
  • 6 years ago
B S Yeddyurappa will take oath as the 23rd Chief Minister of Karnataka. Incidentally he is taking oath as the CM for the third time. In 2007, he was sworn as the CM, but the government lasted only 7 days as the JD(S) refused to transfer power.
#Governor
#Yeddyurappa
#Siddaramaiah
#Kumaraswamy
#KarnatakaAssemblyElections2018

సాధారణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మొదలైన బీఎస్ యడ్యూరప్ప రాజకీయ జీవితం మూడవ సారి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే స్థాయికి చేరుకుంది. కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప ప్రమాణం చేసిన విషయం తెలిసిందే.
యడ్యూరప్ప పూర్తి పేరు బూకనకిరి సిద్ధలింగప్ప యడ్యూరప్ప. ఈయన ఫిబ్రవరి 23, 1943లో మాండ్య జిల్లా కేఆర్ పేట్ తాలూకాలోని బూకనకిరిలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సిద్ధలింగప్ప, పుట్టతాయమ్మ. తమకూరు జిల్లాలోని యెడియూర్ వద్ద సిద్ధలింగేశ్వర అని స్వామిజీ నిర్మించిన శివ ఆలయంలోని దేవుడి పేరును యడ్యూరప్పకు పెట్టారు.
యడ్యూరప్ప తల్లి ఆయనకు నాలుగేళ్లు ఉండగానే చనిపోయింది. మాండ్యాలోని పీఈఎస్ కాలేజీలో యడ్యూరప్ప తన ప్రీ యూనివర్సిటీ కాలేజీ విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో గుమస్తాగా చేరారు. ఆ తర్వాత ఆ జాబ్ వదిలేసి షికారిపురలో వీరభద్ర శాస్త్రికి చెందిన శంకర్ రైస్ మిల్లులో గుమస్తాగా చేరారు.
ఆ రైస్ మిల్ యజమాని కూతురైన మైత్రిదేవిని 1967లో యడ్యూరప్ప వివాహమాడారు. ఆ తర్వాత శివమొగ్గలో ఓ హార్డ్‌వేర్ షాప్ ఏర్పాటు చేశారు. యడ్యూరప్పకు ఇద్దరు కుమారులు రాఘవేంద్ర, విజయేంద్ర, ముగ్గురు కూతర్లు అరుణాదేవి, పద్మావతి, ఉమాదేవి ఉన్నారు. 2004లో యడ్యూరప్ప భార్య నీళ్ల సంపులో పడి మృతి చెందారు.
కాగా, కాలేజీ రోజుల్లోనే యడ్యూరప్ప ఆర్ఎస్ఎస్‌తో అనుబంధాన్ని పెంచుకున్నారు. 1970లో షికారిపుర యూనిట్‌కి కార్యవాహ(సెక్రటరీ)గా నియమితులయ్యారు. 1972లో షికారిపుర మున్సిపాలిటీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత జనసంఘ్ తాలూకా ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.
1975లో షికారిపుర టౌన్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్‌గా యడ్యూరప్ప ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో ఈయన బళ్లారీ, షిమోగాలోని జైళ్లలో ఖైదు అయ్యారు. ఆ తర్వాత 1985లో షిమోగా జిల్లా బీజేపీ అధ్యక్షులయ్యారు. 1988లో బీజేపీ కర్ణాటక అధ్యక్షులయ్యారు.
Recommended