మరో చరిత్ర సృష్టించనున్న జగన్ ప్రజాసంకల్పయాత్ర
  • 6 years ago
Leader of Opposition in Andhra Pradesh assembly and YSR Congress Party President YS Jagan Mohan Reddy's historic walkathon Praja Sankalpa Yatra is progressing successfully and would reach a new milestone of 2,000 kms on May 14, 2018.
#YSJagan
#padayatra
#Andhrapradesh
#PrajaSankalpaYatra

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ నిర్వహిస్తున్న ప్రజా సంకల్పయాత్ర సోమవారం నాటికి ( మే 14) రెండు వేల కిలోమీటర్లు చేరుకోనుంది. రెండు వేల కిలోమీటర్ల మైలు రాయి చేరుకోనున్న సందర్భాన్ని పురస్కరించుకొని పశ్చిమగోదావరి జిల్లాలోని వెంకటాపురంలో 40 అడుగుల పైలాన్‌ను ఏర్పాటు చేశారు. ఈ పైలాన్‌ను జగన్ ఆవిష్కరించనున్నారు.
రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకే వైఎస్ జగన్ 2017 నవంబర్ 6వ తేదిన ప్రజాసంకల్పయాత్ర పేరుతో పాదయాత్రను ప్రారంభించారు.
జగన్ పాదయాత్రను ప్రారంభించి ఇవాళ్టికి సుమారు 161 రోజులు అవుతోంది.
పాదయాత్ర వెంకటాపురం చేరుకోగానే రెండు వేల కిలోమీటర్లకు చేరుకొన్న గుర్తుగా 40 అడుగుల పైలాన్ ను జగన్ ఆవిష్కరిస్తారు. మే 14వ తేదిన ఏలూరు పాత బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు.
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్రకు మద్దతుగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా మే 14, 15 తేదిల్లో రెండు రోజుల పాటు పాదయాత్రలు నిర్వహిస్తున్నారు.
Recommended