Keerthy Suresh Reveals About NTR's Character In Mahanati
  • 6 years ago
Keerthy Suresh keeps suspense on NTR role in Mahanati. Mahanati is the life story of South Indian actress Savitri, who took the film industry by storm in the late '50s and '60s.
#Mahanati
#NTR
#KeerthySuresh

మహానటి చిత్రం మే 9 బుధవారం భారీ విడుదలకు రంగం సిద్ధం అయింది. చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు విన్నూత్నంగా చేస్తూ ఆసక్తి పెంచుతున్నారు. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో ఒదిగిపోయిన నటించిందనే విషయం టీజర్, వీడియో ప్రోమో ద్వారా అర్థం అవుతోంది. దర్శకుడు నాగ అశ్విన్ ఈ చిత్రాన్ని ఓ యజ్ఞంలాగా పూర్తి చేసాడు. సావిత్రి జీవితం గురించి అనేక అపోహలు అభిమానుల్లో ఉన్నాయి. వాటన్నింటిని దర్శకుడు ఎలా చూపించాడు అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. ఈ చిత్రంలో ప్రముఖుల పాత్రలో నటించిన వారిని ఒక్కొక్కరిగా పరిచయం చేస్తూ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు నటించిన సంగతి తెలిసిందే. ఎన్నార్ పాత్రలో నాగ చైతన్య నటించాడు. ఇక ఎన్టీఆర్ పాత్ర గురించి సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది.
సావిత్రి జీవితం 75 శాతం సినిమాలతోనే గడిచింది. ఆమె సినీ జీవితాన్ని ఎన్టీఆర్, ఎన్నార్ లేకుండా తెలుగు వారు ఊహించుకోలేరు. ఎన్నార్ పాత్రలో నాగచైతన్య నటిస్తున్నాడు. మరి ఎన్టీఆర్ పాత్ర ఎవరు అనే ప్రశ్న అభిమానుల్లో ఉంది.
ఇటీవల కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆమెకు ఎన్టీఆర్ పాత్ర గురించి ప్రశ్న ఎదురైంది. ఎన్టీఆర్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించి ఉంటే బావుండేది అని యాంకర్ అనగా.. తాము కూడా అలాగే అనుకున్నాం కానీ అది జరగలేదు అని కీర్తి సురేష్ తెలిపింది.
జూనియర్ ఎన్టీఆర్ తన తాతగారి పాత్రలో నటించలేదు. ఎన్టీఆర్ గా ఎవరిని చూపించబోతున్నారు అనేప్రశ్నకు కీర్తి సురేష్ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. మీరే సినిమాలో చూస్తారు అంటూ సస్పెన్స్ లోకి నెట్టింది.
Recommended