IPL 2018: Dhoni Created New Record In Sixes

  • 6 years ago
MS Dhoni smashed the ball into the crowd seven times - including the one to seal the winning runs - in a match that racked up a record number of Indian Premier League sixes as his Chennai Super Kings beat Royal Challengers Bangalore to go top of the table.
#IPL 2018
#Dhoni
#Chris gayle
#Rohit sharma

పూణె వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించి ఆరు వికెట్ల తేడాతో బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న బెంగళూరును మరోసారి ఓడించింది. మొదట స్పిన్నర్ల ధాటికి ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్‌ క్రీజులో నిలదొక్కుకోలేక వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు.
ఓపెనర్‌ పార్థీవ్‌ పటేల్‌ 41 బంతుల్లో (53) చివర్లో టిమ్‌ సౌథీ 26 బంతుల్లో (36) నాటౌట్‌ రాణించడంతో ఆర్‌సీబీ వంద పరుగుల మార్కు దాటగలిగింది. అనంతరం 128పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి మొదట్లో ఉమేశ్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కళ్లెం వేశాడు. అయితే మిగతా బౌలర్లు సత్తా చాటలేకపోవడం.. మరోవైపు పేలవ ఫీల్డింగ్‌తో బెంగళూరుకు ఓటమి తప్పలేదు.
చెన్నై కెప్టెన్ ధోనీ 23బంతుల్లో (31) నాటౌట్‌ మరోసారి తనదైన శైలిలో ఫినిషింగ్‌ ప్రదర్శనతో మరో 12బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే కెప్టెన్‌గా ధోనీ జట్టును ముందుండి మ్యాచ్‌ను గెలిపించడమే కాకుండా ఈ మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
వ్యక్తిగతంగా ఈ సీజనులో ధోనీ అత్యధిక సిక్సర్లు(27) బాది నూతన రికార్డును నెలకొల్పాడు. గతంలో 2013లో అత్యధికంగా 25సిక్సర్లు బాదగా.. అంతకుముందు 2011లో 23సిక్సర్లు, 2014 ఐపీఎల్‌లో 20 సిక్సర్లు కొట్టాడు. దీంతో తన ఐపీఎల్‌ కెరీర్‌లో తొలిసారిగా ఈ సీజన్‌లోనే అత్యధిక సిక్సర్లు సాధించగలిగాడు. అది కూడా కేవలం 10 మ్యాచ్‌లలోపే కావడం విశేషం. మరోవైపు మొత్తం ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ధోనీ (183 సిక్సర్లతో) మూడో స్థానంలో కొనసాగతున్నాడు. ధోనీ కంటే ముందు క్రిస్‌ గేల్‌(290), రోహిత్‌ శర్మ (183) ఉన్నారు.

Recommended