Mahanati Audio Launch:savitri Family Emotional speech

  • 6 years ago
MahaNati Audio launch live updates. NTR is chief guest to the event. NTR Speech at MahaNati Audio launch event
మహానటి ఆడియో లాంచ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. మహానటి సావిత్రి గారి గురించి మాట్లాడే అర్హత ఎన్ని జన్మలెత్తినా రాదేమో అని ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ తన ప్రసంగం చివరి వరకు ఆచి తూచి మాట్లాడడం విశేషం.
మహానటి సావిత్రి నిజమైన సూపర్ స్టార్ అని ఎన్టీఆర్ అన్నాడు. సావిత్రిగారు ఎలా మరణించారొ ముఖ్యం కాదని, ఆమె ఎలా బ్రతికారనేదే ఈ చిత్రం అని ఎన్టీఆర్ తెలిపాడు. నాగ అశ్విన్ సావిత్రి గారికి ఓ అభిమానిగా ఈ చిత్రాన్ని తీసాడని ఎన్టీఆర్ తెలిపాడు.
ఓ గొప్పపని చేసే సమయంలో వెతుక్కోవలసిన అవసరం ఉండదు. కావలసినవన్నీ అలా సమకూరుతాయి.సావిత్రి గారి ఆత్మ పట్టు బట్టి మరీ తన బయోపిక్ లో నటించమని ఈ నటుల్ని పంపారని కీర్తి సురేష్, సమంత, దుల్కర్, విజయ్ దేవర కొండని ఉద్దేశించే ఎన్టీఆర్ అన్నాడు.
ఈ చిత్ర నిర్మాత స్వప్న ఓ సారి తన వద్దకు వచ్చి చిరునవ్వు నవ్వుతూ ఓ కోరిక కోరారని ఎన్టీఆర్ అన్నారు. ఈ చిత్రంలో కామియోగా తాతగారి వేషం వేయమని అడిగారని ఎన్టీఆర్ తెలిపాడు. కానీ తాతగారి పాత్రలో నటించే అర్హత తనకు లేదని ఎన్టీఆర్ అన్నాడు. తాతగారి పాత్ర పోషించడం ఈ జన్మలో జరగని పని అని ఎన్టీఆర్ తెలిపాడు. తాతగారి పాత్రలో నటించాలంటే తన దమ్ము సరిపోదని ఎన్టీఆర్ తెలిపాడు.

Recommended