Mahanati Savitri Daughter Faces Serious Controversies

  • 6 years ago
Mahanati Savitri Daughter Vijaya Chamundeswari Real Behaviour Revealed by Relative. Savitri was an Indian film actress, playback singer, dancer, director and producer.

ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' చిత్రం సూపర్ హిట్ అయింది. సినిమా విడుదల ముందు, విడుదల తర్వాత జరిగిన ప్రమోషన్లలో సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి ఎక్కువగా ఫోకస్ అయ్యారు.మీడియా వారు కూడా ఆమెను ఇంటర్వ్యూ చేయడానికే ఆసక్తి చూపడం, ఆయా ఇంటర్వ్యూలో ఆమె తన తల్లిని తలుచుకంటూ ఎమోషనల్ అవ్వడం, భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టడం లాంటివి చూశాం. అయితే విజయ చాముండేశ్వరి గురించి తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. సావిత్రిని బాధించిన వారిలో ఈవిడ కూడా ఒకరు అంటూ కెవి చౌదరి మనవరాలు ఆరోపించారు.
సావిత్రి ఎలా తాగారు? తాగడం ఎలా నేర్చుకున్నారు? అనే డిస్క్రర్షన్ సాగుతోంది. చౌదరి బాగా తాగేవారు, దుర్గాంబ కూడా బాగా తాగేవారు. సావిత్రి అలాంటి వాతావరణంలో పెరిగింది. ఎవరు తాగుడు నేర్పించారు అనేది ఇపుడు ముఖ్యం కాదు. సావిత్రి అలా తాగి ఆరోగ్యం పాడుచేసుకుంటుంటే సొంత డాటర్ నువ్వు ఉన్నావు. నువ్వు అపుడు చిన్న పిల్లవేం కాదు. నువ్వేం చేశావు? ఆవిడను ఇంకా ఇంకా బాధ పెట్టావు. బయోపిక్ అంటే అన్ని నిజాలు చూపించాలి, అందుకే తాగుడు చూపించామని ఇంటర్వ్యూలో నువ్వు చెప్పడం విన్నాను. కానీ మిగతా నిజాలు కూడా ఎందుకు చూపించ లేదు? మీరు కోర్టు కేసు వేసి ఆవిడను ఇంకా ఇంకా హింసించారు.... ఆ విషయం ఎందుకు చూపించలేదు అని విజయ చాముండేశ్వరిని చౌదరి మనవరాలు ప్రశ్నించారు.

Recommended