IPL 2018: Delhi Proved their dareness
  • 6 years ago

Dis: Phew! Kids these days! Shreyas Iyer is 23. Prithvi Shaw is 18. And together they pulled Delhi Daredevils out from the depths of despair with an emphatic show of batsmanship against Kolkata Knight Riders at the Ferozeshah Kotla here on Friday (April 27). The 219 for four that Delhi Daredevils made itself guaranteed them their second win of this IPL after the one they scored against Mumbai Indians that had begun to look like a result from a different era. Daredevils defeated Kolkata Knight Riders by 55 runs.

ఈ సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆడిన మూడో మ్యాచ్లో విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. అయితే, ఢిల్లీ జట్టు సమిష్టిగా రాణిస్తే ఫలితం ఎలా ఉంటుందో అభిమానులకు ఒకసారి రుచి చూపించింది.
కోట్లా వేదికగా శుక్రవారం రాత్రి కోల్ కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టోర్నీ ఆరంభం నుంచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ జట్టు ఏడో స్థానానికి ఎగబాకింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లలో ఆండ్రీ రస్సెల్‌(44)కు తోడు శుభ్‌మాన్‌ గిల్‌(37), నరైన్‌(26)లు మాత్రమే ఫర్వాలేదనిపించారు.
మిగతా వారంతా స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు చేరడంతో కోల్‌కతా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి ఓటమి పాలైంది. టోర్నీలో వరుసగా మూడు పరాజయాల తర్వాత మళ్లీ ఢిల్లీ గెలుపొందగా.. కోల్‌కతాకి వరుసగా ఇది రెండో ఓటమి.
#IPL 2018
#Delhi daredevils
#Kolkata knight riders
#Dinesh karthik
Recommended