RGV Replies To All Pawan Fans

  • 6 years ago
Hello all, here are my views in the controversial context of Sri Reddy & Pawan Kalyan. Ram Gopal Varma talks about Sri Reddy abusive comments on Pawan Kalyan, and in Tollywood. Watch out the full video to know RGV's take on the burning issue in Tollywood." RGV said

పవన్ కళ్యాణ్ మీద శ్రీరెడ్డి తిట్టు వాడటంతో తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు, ఇతరులు కలిసి శ్రీరెడ్డి మీద విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త వాదనతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
పదం అర్థం తల్లిని తిట్టడం కాదు. అది ఒక ఇంగ్లిష్ వర్డ్ నుండి వచ్చింది. ఒక మగాడు తన అమ్మను కూడా ఇలా ఆలోచిస్తాడా అని మగాడిని తిట్టే తిట్టు. అది ఎలా తల్లికి వర్తింస్తుందో నాకు అర్థం కావడం లేదు.... అంటూ వర్మ వాదించారు.
ఆ పదం వాడినందకు కోపమా? లేక పవన్ కళ్యాణ్‌ను ఆ మాట అన్నందుకు కోపమా? అనేది మరో పాయింట్. ఆ పదం అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ వాడితే అది స్టేట్ వైడ్ సూపర్ హిట్ అయింది. క్యాచీ వర్డ్ అనే స్టేటస్ కొన్ని నెలల క్రితమే దానికి ఇచ్చారు. మగాడు అంటే ఓకే..... అమ్మాయి అంటే ఓకే కాదా?.... అని వర్మ ప్రశ్నించాడు.
ఆ మాట కొస్తే పవన్ కళ్యాణ్‌కు ఉన్న కొంత మంది అభిమానులు, వారి లాంగ్వేజ్ చూస్తే వారికి తిట్లు తప్ప వేరే లాంగ్వేజ్ రాదా అనిపిస్తుంది. అంత మాత్రాన అందరు ఫ్యాన్స్ అలా అని అనడం లేదు. ఎందుకంటే నాతో పాటు మా మదర్, సిస్టర్ అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. ఆయన్ను సీఎంగా చూడాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం.... అని వర్మ తెలిపార
కాస్టింగ్ కౌచ్ అనే ఇష్యూను ఇంత పెద్దగా చేసి అందరూ దీనిపై కదిలేలా చేసిన క్రెడిట్ కేవలం శ్రీరెడ్డిదే. మన చిన్నప్పటి నుండి కాస్టింగ్ కౌచ్ గురించి వింటున్నాం. ఇంత రాపిడ్, హెవీ డిస్క్రషన్స్ జరిగింది శ్రీరెడ్డి బట్టలు విప్పి నిరసన తెలుపడం వల్లనే. ఆమె అలా చేయడంతో నేషనల్, ఇంటర్నేషనల్ ఫోకస్ టాలీవుడ్లో ఏం జరుగుతుంది అనే విషయం తెలుసుకునేలా ఫోర్స్ చేసింది.

Recommended