పాదయాత్ర తర్వాత అనూహ్య నిర్ణయం, బాబుకు జగన్ షాక్
  • 6 years ago
YSR Congress party chief Y.S. Jagan Mohan Reddy is likely to give a major blow to AP Chief Minister N. Chandrababu Naidu after the completion of his ongoing Praja Sankalpa Yatra.

2019 ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక హోదాపై అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. హోదా కోసం టీడీపీ, వైసీపీలు పోటాపోటీగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. పదవులకు రాజీనామా చేసి, ఢిల్లీలో వైసీపీ దీక్ష చేస్తే, టీడీపీ ప్రధాని నివాసం వద్ద ఆందోళన నిర్వహించింది.
రాష్ట్రంలోను బంద్ ఆంటూ దీక్షలు అంటూ పోటీ పడుతున్నాయి. ఈ నెల 20వ తేదీన చంద్రబాబు సహా టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేయనున్నారు. మరోవైపు జగన్ హోదా అంశంపై వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే ఎంపీలతో రాజీనామా చేయించారు. త్వరలో ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారని అంటున్నారు.
ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న జగన్ త్వరలో చంద్రబాబుకు గట్టి షాకివ్వనున్నారని అంటున్నారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీని కార్నర్ చేసేందుకు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో సామూహిక రాజీనామాలు చేయించనున్నారని అంటున్నారు. ఇప్పటికే ఎంపీలు రాజీనామా చేశారు. ఇక వరుసలో ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతున్నారు.
ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం జగన్ పాదయాత్ర మే 10న ముగియనుంది. పాదయాత్ర మరో ఇరవై రోజులు పొడిగించే అవకాశాలు ఉండొచ్చునని చెబుతున్నారు. ఈ పాదయాత్ర అనంతరం జగన్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే అనూహ్య నిర్ణయం తీసుకోనున్నారని అంటున్నారు.
షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 2019లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 2018 నుంచి ఏప్రిల్ 2019 మధ్య ఎన్నికల కమిషన్ ఎప్పుడైనా ఎన్నికల తేదీని ప్రకటించే అవకాశముంది. దీని కంటే ముందే తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి జగన్ రాష్ట్రంలో మరింత హోదా వేడిని రాజేయాలని చూస్తున్నారని అంటున్నారు.
ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి హాజరు కావడం లేదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే వరకు తాము సభకు వచ్చేది లేదని తేల్చి చెప్పింది. అందుకే బడ్జెట్ సమావేశాలకు హాజరు కాలేదు. పార్టీ ఎమ్మెల్యేల సామూహిక రాజీనామా నిర్ణయంపై జగన్ త్వరలో నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.
Recommended