IPL 2018 : MS Dhoni Wants 2 Extra Runs In IPL When Ball Is Hit Out Of Stadium
  • 6 years ago
MS Dhoni added that he too feels the pressure but he will be expressing it in the dressing room unit unlike the other players in the dugout. MS Dhoni finished his interview by hinting an addition of 2 runs to the score if a player whacks the ball out of the stadium.

క్రికెట్‌‌కు సంబంధించి మహేంద్ర సింగ్ ధోని ఓ సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బ్యాట్స్‌మన్‌ సిక్స్‌ బాదినప్పుడు ఆ బంతి స్టేడియం వెలుపల పడితే, మరో రెండు పరుగులు అదనంగా ఇస్తే బాగుంటుందని ధోని అభిప్రాయపడ్డాడు.
టోర్నీలో భాగంగా మంగళవారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌- చెన్నై సూపర్‌కింగ్స్‌ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో మొత్తం 31 సిక్సర్లు, 20 ఫోర్లు నమోదయ్యాయి. దాదాపు రెండేళ్ల తర్వాత చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు సిక్సర్ల మోత మోగించారు.
ఈ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు 17 సిక్సర్లు బాదగా, చెన్నై జట్టు 14 సిక్సర్లు బాదింది. అయితే కోల్‌కతా జట్టు బాదిన 17 సిక్సర్లలో 11 సిక్సర్లు ఆండ్రూ రసెల్ ఒక్కడే బాదడం విశేషం. అందులో కొన్ని సిక్సర్లకు గాను బంతి స్టేడియం వెలుపల పడింది. చివరి వరకు హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించింది.
మ్యాచ్‌ అనంతరం ధోని మాట్లాడుతూ 'రెండేళ్ల తర్వాత సొంతగడ్డపై ఆడటం, ఆడిన తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ మ్యాచ్‌లో ఎన్నో సిక్స్‌లు నమోదుయ్యాయి. ఐపీఎల్‌లో బ్యాట్స్‌మెన్‌ బంతిని బాదినప్పుడు అది స్టేడియం దాటి వెళ్లినప్పుడు సిక్స్‌తో పాటు మరో రెండు పరుగులు అదనంగా ఇస్తే బాగుంటుంది' అని జోక్ చేశాడు. రెండేళ్ల తర్వాత చెపాక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో నమోదైన ఫోర్లు, సిక్సర్ల మోతను చూసి అభిమానులు చాలా ఎంజాయ్‌ చేశారని ధోని అన్నాడు.
Recommended