IPL 2018 : Rajinikanth Backs Opposition To IPL In Chennai
  • 6 years ago
Amid opposition to IPL matches herein view of raging protests over Cauvery issue, Tamil film star Rajinikanth on Sunday said it would be good if organisers stopped the games in the city as such a gala event would be embarrassing when the entire Tamil Nadu was agitating.

కావేరీ నది జలాల కోసం తమిళనాడు పెద్ద ఎత్తున్న నిరసనలు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మ్యాచ్‌లను తాకాయి. ఈ నిరసనలకు తమిళ సినీ పరిశ్రమ కూడా మద్దతిచ్చింది.
తమిళ స్టార్ హీరోలంతా చెన్నైలో శాంతియుత నిరసన చేపట్టారు. అయితే ఈ సందర్భంగా తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ మాట్లాడుతూ ఇలాంటి సమయంలో చెన్నైలో ఐపీఎల్ నిర్వహణ సరికాదని, మ్యాచ్‌లను బహిష్కరించాలని క్రికెట్ అభిమానులకు పిలపునిచ్చారు.
అలాగే తమిళ ప్రజల నిరసనకు మద్దతు తెలుపుతూ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలు ధరించి క్రికెట్ ఆడాలని ఆయన సూచించారు. రజనీకాంత్ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఐపీఎల్ మ్యాచ్ రద్దు చేయాలని పలు పార్టీలు పిలుపునివ్వడంతో 2,000 మంది పోలీసు సిబ్బందిని స్టేడియం వద్ద మోహరిస్తున్నారు.
మ్యాచ్‌ను తిలకించడానికి నల్ల దుస్తులతో వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ స్టేడియంలోకి అనుమతించేది లేదని పోలీసు వర్గాలు తెలిపారు. తమిళనాడులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రజనీకాంత్ లాంటి హీరో పిలుపునిస్తే ఆ ప్రభావం కచ్చితంగా మ్యాచ్‌పై పడుతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. రెండేళ్ల తరవాత చెన్నై మళ్లీ ఐపీఎల్‌లో అడుగుపెట్టి చెపాక్ స్టేడియంలో తొలి మ్యాచ్ ఆడబోతోంది. చెన్నై అభిమానులు కూడా ఎప్పుడెప్పుడా అని మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తున్నారు.
Recommended