IPL 2018: Kolkata Knight Riders Andre Russell Discovers Tennis Shot

  • 6 years ago
Since the advent of the Twenty20 format, the cricketing arena has witnessed numerous unorthodox shots.
#kolkataknightriders
#ipl2018
#andrerussell

అంతర్జాతీయ క్రికెట్‌లో షార్ట్ ఫార్మాట్ క్రికెట్ టీ20. ఈ ఫార్మాట్‌లో అద్భుతమైన షాట్‌లు, స్టన్నింగ్ క్యాచ్‌లు సర్వ సాధారణం. అలాంటిది ఐపీఎల్‌లో.. అయితే ఇక ప్రత్యేకంగా చెప్పే పనిలేదు. ఈ క్రమంలో ఐపీఎల్ 11వ సీజన్‌లో క్రికెటర్లు రెచ్చిపోయి ఆడారు. ఈ దశలో ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్, కోల్‌కతాలు తలపడ్డాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై కోల్ కతా 25పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఇన్నింగ్స్ ఆడుతోన్న సమయంలో ఆండ్రీ రస్సెల్ కొట్టిన షాట్ కొత్తగా అనిపించింది. బ్యాట్ ఝళిపించిన తీరును టెన్నిస్ ఆడుతున్నట్టుగా ఉందంటూ స్టేడియంలో కోల్‌కతా అభిమానులు హర్షధ్వానాలు చేశారు. ఆ బాదుడికి బాల్ సిక్సు బౌండరీకి తరలిపోతుంటే బౌలర్ జోఫ్రా ఆర్ఛర్ గాలిలోకి చూస్తూ ఉండిపోయాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న ఆండ్రీ రస్సెల్ షాట్లను ఐపీఎల్ అధికారిక వైబ్ సైట్లో పొందుపరిచింది.

Recommended