తెలంగాణ రెవిన్యూ లోటు పై కాగ్ షాకింగ్ రిపోర్ట్
  • 6 years ago
The Comptroller and Auditor General (CAG) has been very critical of the TS government's financial management and financial indiscipline, suggests audit reports tabled by the government in the Assembly on Thursday.

తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతున్నట్టు.. రాష్ట్రం మిగులు బడ్జెట్ లో లేదని, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నదని కాగ్ రిపోర్ట్ కుండబద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. కాగ్ నివేదిక తెలంగాణ ప్రభుత్వంపై అక్షింతలు వేసింది. ఆర్థిక క్రమశిక్షణ రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా పోయిందని కాగ్ అభిప్రాయపడింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 5,392 కోట్ల రెవిన్యూ లోటు ఉంటే, రూ.1386 కోట్లు రెవిన్యూ మిగులుగా చూపారని కాగ్ ప్రభుత్వం తీరును బయటపెట్టింది. పద్దుల నమోదు సక్రమంగా లేదని కాగ్ అభిప్రాయపడింది
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలకు ఇప్పుడిదో అస్త్రంలా మారింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ఓవైపు రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉందని కాగ్ నివేదిక చెబుతుంటే.. కాదు, ధనిక రాష్ట్రమని ఆర్భాటపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాగ్ నివేదికను చివరి నిమిషంలో అసెంబ్లీలో బయటపెట్టి సభలో చర్చకు రాకుండా తెలంగాణ ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు.
ఉన్నదంతా పంచితే.. పంచె కూడా ఊడిపోతుందని చెబితే మమ్మల్నే అపహాస్యం చేశారని అన్నారు. చివరకు కాగ్ నివేదికలో అదే తేలిందని, టీఆర్ఎస్ మోసాలన్ని అందులో ఉన్నాయని అన్నారు.
అప్పులు తీసుకొచ్చి మరీ రాష్ట్రం మిగులు బడ్జెట్ లో ఉందని లెక్కలేయడమే ప్రభుత్వ దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు. గొప్పలకు పోయి అప్పులు తెచ్చి.. వాటినే ఆస్తులుగా చూపిస్తూ, పైగా అప్పులు చేయని రాష్ట్రమే లేదంటూ చెప్పడం హాస్యాస్పదం అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంతసేపూ ఓట్లు రాబట్టే ప్రయత్నమే తప్ప.. అభివృద్ధి, సంక్షేమం అనే విషయాలను పట్టించుకోలేదన్నారు.
ఎన్నికల సమయంలో లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తామని ప్రచారం చేసిన కేసీఆర్.. ఈ నాలుగేళ్లలో వెయ్యి ఇళ్లు కూడా పూర్తి చేయలేదని గుర్తుచేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో రూ. 800 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, మిషన్ కాకతీయల పనులన్ని నత్త నడకన సాగుతున్నాయని ఆరోపించారు. సకాలంలో రుణాలు అందక 15లక్షల మంది రైతులు నష్టపోయారని అన్నారు.
Recommended