Rangasthalam Movie Get Sensored In UAE

  • 6 years ago
Rangasthalam movie first review from UAE. Umair Sandhu told amzing things about Rangasthalam movie

ఈ ఏడాది వేసవిలో సందడి చేయబోతున్న క్రేజీ చిత్రాలలో రంగస్థలం చిత్రం కూడా ఒకటి. సుకుమార్ శైలిలో రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలినుంచీ అందరి దృష్టిని ఆకర్షించింది. మెగాపవర్ స్టార్ రాంచరణ్ కథానాయకుడిగా ఈ చిత్రంలో ప్రయోగమే చేయబోతున్నాడు.
వినికిడి లోపం ఉన్న యువకుడిగా నటించబోతున్నాడు చరణ్ వంటి స్టార్ స్టేటస్ ఉన్న హీరోని వినికిడి లోపంతో చూపించడం అంటే సాహసమే. కానీ అదే అంశం అభిమానులకు బాగా చేరువైంది. టీజర్ ట్రైలర్ లో రాంచరణ్ నటన అదుర్స్ అనిపించే విధంగా ఉంది. ఇక వెండి తెరపై ఎలా ఉండబోతోందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొనివుంది
పల్లెటూరి రాజకీయ నేపథ్యంలో బలమైన కథతో ఈ చిత్రం సాగనుంది. టైలర్ లో చూపిన విధంగా ఈ చిత్రంలో ఆకట్టుకునే రాజకీయ అంశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. హీరో ఆది పినిశెట్టి రామ్ చరణ్ సోదరుడిగా నటించాడు.
సమంత ఈ చిత్రంలో పేదింటి పల్లెటూరి అమ్మాయిగా రామలక్ష్మిగా కనిపించబోతోంది.
రంగస్థలం చిత్రానికి తొలి రెస్పాన్స్ యూఏఈ నుంచి వచ్చేసింది. తాజాగా రంగస్థలం చిత్రం యూఏఈలో సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకుంది. ప్రముఖ క్రిటిక్ మరియు యూఏఈ సెన్సార్ సభ్యుడు ఉమర్ సంధు రంగస్థలం చిత్రంపై తన స్పందనని సోషల్ మీడియా వేదికగా తెలియజేసాడు.

Recommended