Ram Charan About Rangasthalam : Chitti Babu was throw Challenge
  • 6 years ago
Set in the 1980s, film sees Ram Charan essay the role of Chitti Babu, a partially deaf individual who's full of life. Ram Charan plays the childishly innocent character with perfection and its refreshing to see such a character in an industry.

రంగస్థలం చిత్రం రాంచరణ్‌కు నటుడిగా కొత్త జోష్‌ను తెచ్చింది. అటు నటుడిగానే కాకుండా కలెక్షన్ కింగ్‌గా కొత్త హోదాను తీసుకొచ్చింది. ప్రస్తుతం రంగస్థలం విజయానందంలో రాంచరణ్ మునిగి తేలుతున్నాడు. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆనందాన్ని, సినిమా విశేషాలను పంచుకొన్నారు.
నా పదేళ్ల నటజీవితంలో రంగస్థలం గొప్ప మార్పు తెచ్చింది. నటుడిగా సవాళ్లతో కూడిన పాత్రలను ధరించడానికి ఎప్పుడూ ఎదురుచూస్తుంటాను. రంగస్థలంలో చెవిటివాడి పాత్రను పోషించడం నిజంగా ఓ సవాల్‌గా మారింది. చిట్టిబాబు పాత్ర నిజంగా నాకు విభిన్నమైనది. అందుకే ప్రేక్షకులు ఆ పాత్రకు, సినిమాకు బ్రహ్మరధం పడుతున్నారు అని రాంచరణ్ అన్నారు.
నా నటజీవితంలో నేనెప్పుడూ గ్రామీణ యువకుడి పాత్రను పోషించలేదు. నేను ఎన్నడూ ఓ గ్రామంలో నివసించలేదు. నా సొంత గ్రామానికి నా తండ్రితో కలిసి చాలా తక్కువగా వెళ్లాను. కానీ రంగస్థలం కొత్త గ్రామీణ వాతావరణాన్ని పరిచయం చేసింది అని రాంచరణ్ పేర్కొన్నారు.
రంగస్థలం సినిమా షూటింగ్ కోసం మేము ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతానికి వెళ్లాం. అక్కడ మొబైల్ సర్వీస్ గానీ, విలాసవంతమైన హోటళ్లు లేవు. కానీ అవి లేవని ఎప్పుడూ బాధపడలేదు. రంగస్థలం సినిమా షూటింగ్‌ నటుడిగా నాపై ఎంతో ప్రభావం చూపింది అని చెర్రీ వెల్లడించారు.
చెవిటి వాడి పాత్రను పోషించడానికి నేను చాలా రీసెర్చ్ చేశాను. చిట్టిబాబు పాత్రను అర్థం చేసుకోవడానికి, బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకోవడానికి దాదాపు ఐదు నెలలు శ్రమించాను. ఇప్పటివరకు నేను ముతక పాత్రలు పోషించలేదు. వాస్తవ రూపం ఉండేలా ఆ పాత్రను పోషించాలనుకొన్నాను అని రాంచరణ్ అన్నాడు.
Recommended