Rana Talks About His Dubbing Experiences In Avengers-Infinity.
  • 6 years ago
Marvel Studios’ Avengers: Infinity War is the culmination to an unprecedented cinematic journey. 10 years in the making, it promises to be the Super Hero spectacle audiences have been waiting for.

మార్వెల్ స్టూడియోస్ వారి 'ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్' ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సూపర్ హీరోల అందరి కలయిక. మార్వెల్ స్టూడియోస్ 10 సంవత్సరాల ప్రస్థానానికి 'ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్' ని క్లైమాక్స్ గా చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరయ్యే కొద్దీ 'డిస్నీ ఇండియా' ఈ చిత్రాన్ని ప్రేక్షకులకి మరింత దగ్గిర చేసే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే 'ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్' తెలుగు వెర్షన్ కి సౌత్ స్టార్ హీరో రానా దగ్గుబాటి భాగం కానున్నారు. 'ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్' విలన్ తానొస్‌కు రానా డబ్బింగ్ చెప్పారు.
చిత్రం మీద ప్రేక్షకులకి ఉన్న ఆసక్తి దృష్ట్యా అత్యంత భారీగా నిర్మించిన ఈ చిత్రాన్ని వీక్షకులు వారి వారి భాషల్లో ఆస్వాదించేందుకు అన్ని భాషల్లో విడుదల చేస్తున్నాం. ఇప్పుడు తానొస్‌కు రానా దగ్గుబాటి వాయిస్ అందివ్వడంతో, ఈ చిత్రం ప్రేక్షకులకి మరింత దగ్గిరవుతుంది అని నమ్ముతున్నాం." అన్నారు.
రానా దగ్గుబాటి మాట్లాడుతూ, " నేను మార్వెల్ కామిక్స్‌ని చదువుతూనే పెరిగాను. సూపర్ హీరోల కథలని ఆకట్టుకునేలా, ఎన్నో భాగాలుగా చెప్పడం మార్వెల్ సినిమాల గొప్పదనం. మార్వెల్ తమ పాత్రల్ని సృష్టించడంలో కానీ వాటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులతో కనెక్ట్ చేయడంలో కానీ మార్వెల్ ది తిరుగులేని స్థాయి అని అన్నారు.
ఐరన్ మాన్, కెప్టెన్ అమెరికా నా ఫేవరెట్ కేరక్టర్స్. 'ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్' కి డబ్బింగ్ చెప్పడం థ్రిల్లింగ్ గా ఉంది. ఎవెంజర్స్ లాంటి సూపర్ హీరోల ని సైతం ముప్పతిప్పలు పెట్టే సూపర్ విలన్ తానొస్ గా వినిపించడం మరిచిపోలేని ఎక్స్పీరియన్స్ రానా పేర్కొన్నారు.
'జంగల్ బుక్' కి టాప్ బాలీవుడ్ స్టార్స్ అయిన ప్రియాంక చోప్రా, ఇర్ఫాన్, నానా పటేకర్, ఓం పూరి, షెఫాలీ షా వంటి వారితో ఆ చిత్రం లోని పాత్రకి డబ్బింగ్ చెప్పించారు
Recommended