Kajal Agarwal Talks About Her Jouney In Industry

  • 6 years ago
Kalyan Ram's MLA, short for Manchu Lakshanulla Abbayi, is all set to the hit the screens this Friday. The actor assures his audience that the film, which is set in a political backdrop, is an out-and-out entertainer. Kajal Agarwal is the Heroine. MLA movie set to release on March 23. In this occassion, Kajal Agarwal speaks to Telugu Filmibeat exclusivel

అందాల తార కాజల్ అగర్వాల్ లక్ష్మీ కల్యాణం సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి ప్రవేశించింది. ఆ తర్వాత పదేళ్ల కెరీర్ అనంతరం మళ్లీ కల్యాణ్ రామ్‌తో ఎంఎల్ఏ చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రంలో మార్చి 23 తేదీని విడుదలకు సిద్దమవుతున్నది. ఈ నేపథ్యంలో కాజల్ అగర్వాల్ తన పదేళ్ల జీవితం గురించి, ఎంఎల్ఏ సినిమాలోని పాత్ర గురించి వివరించింది. కాజల్ వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే..
ఎంఎల్‌ఏ చిత్రంలో కార్పోరేట్ కంపెనీలో పనిచేసే ఉద్యోగి అనేది నా క్యారెక్టర్. ఎన్నారై పాత్ర. ఇంటర్వెల్‌లో ట్విస్ట్‌తో నా పాత్ర అసలు విషయం తెలుస్తుంది. ఈ సినిమాలో మంచి మెసేజ్ ఉంది. అది కూడా ఎంటర్‌టైనింగ్ మ్యానర్‌లో ఉంటుంది. కల్యాణ్ రామ్‌కు పది మార్కులగానూ ఎనిమిదిన్నర పాయింట్లు ఇస్తాను.
లక్ష్మీకల్యాణం సినిమా తర్వాత పదేళ్లకు మళ్లీ కల్యాణ్‌రామ్‌తో కలిసి నటించాను. పదేళ్ల తర్వాత అదే రిలేషన్. ఓ మంచి ఫ్రెండ్ మాదిరిగా రిసీవ్ చేసుకొన్నారు. పదేళ్ల కెరీర్‌ పరంగానూ. చాలా అన్ని రకాలుగా ఎదిగాం. లక్ష్మీకల్యాణం తర్వాత కల్యాణ్ కలిసిన దాఖలాలు లేవు.
లక్ష్మీ కల్యాణం సినిమాలో నటించేటప్పుడు నేను 50 చిత్రాల్లో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఒకటో, రెండో సినిమాలు చేసి ఎంబీఏ చదువుకొందామని అనుకొన్నాను. కానీ పదేళ్లకుపైగా జీవితంలో 50 సినిమాలు చేయడం చాలా హ్యాపీగా ఉంది. అందుకు తెలుగు ప్రేక్షకులకు నేను రుణపడి ఉంటాను.
నా కెరీర్‌లో గ్లామర్ తారగా ఎన్నో పాత్రలు పోషించాను. కానీ ప్రస్తుతం నేను అంగీకరించే పాత్రల విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. యాక్టర్ అనేటప్పుడు విభిన్నమైన, విలక్షణమైన పాత్రలు పోషించాలి. డ్యాన్సులు, పాటలకే పరిమితం కాకుండా నటిగా నా ప్రభావం చూపే విధంగా చూసుకొంటున్నాను. ఇదంతా ఒక రోజుల సాధ్యపడేది కాదు. కొన్నేళ్ల కెరీర్‌లో జరిగే పరిణామం మాత్రమే.

Recommended