Kajal Agarwal Interview About Kavacham Movie | Filmibeat Telugu
  • 5 years ago
Kavacham is the latest Telugu film starer Kajal Agarwal and Bellamkonda Srinivas. In an interview with a media channel, She has expressed confidence that the audience will develop the curiosity what will happen next in the movie.
అందాల తాతర కాజల్ అగర్వాల్ కెరీర్‌పరంగా దూసుకెళ్తున్నారు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి కవచం అనే సినిమాలో నటిస్తున్నారు. కవచం డిసెంబర్ 7న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. ఆమె వెల్లడించిన తన ప్రొఫెషనల్, పర్సనల్ విషయాలు మీకోసం.. బెల్లంకొండ శ్రీనివాస్ కలిసి చేస్తున్న కవచం మూవీ సస్పెన్స్ థ్రిల్లర్. అందులో లవ్ స్టోరి ఉంటుంది. సినిమా చూస్తుంటే సీట్లకు హత్తుకొని ప్రేక్షకులు చూడటం ఖాయం. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. కథలో మలుపు చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. పక్కాగా ఈ సినిమాలో కమర్షియల్ వ్యాల్యూస్ ఉంటాయి. 2018 సంవత్సరం అ! అనే చిత్రంతో బ్రహ్మండంగా ప్రారంభమైంది. కవచం లాంటి సినిమాతో గ్రాండ్‌గా ముగియబోతున్నది. వాస్తవానికి నేను 2018లో బ్రేక్ తీసుకోవాలనుకొన్నాను. నా ఆరోగ్యం బాగా క్షీణించింది. 3 నెలలు మంచానికే పరిమితం అయ్యాను. నేను కోలుకోవడానికి చాలా సమయం పట్టింది.
#Kavacham
#KajalAgarwal
#BellamkondaSrinivas
#KajalAgarwalInterview
Recommended