Dhoni Will Not Figure In Top Grade | Oneindia Telugu

  • 6 years ago
Currently, the contract for players of the national team is divided into three categories – A, B and C . The new proposal will see the contracts divided into four grades - A+, A, B and C. Only those who perform well in all formats of the game will be eligible for the topmost category.

సుప్రీం కోర్టు నియమించిన బీసీసీఐ పాలకుల కమిటీ టీమిండియా ఆటగాళ్లకు త్వరలో ఓ శుభవార్తను తెలపనుంది. ఈ శుభవార్త ఏంటంటే బోర్డు పరిధిలో ఆడుతున్న క్రికెటర్ల జీతాలు భారీగా పెరగనున్నాయి. ఇందులో భాగంగా ఆటగాళ్ల కోసం కొత్త కాంట్రాక్టు పద్ధతిని తీసుకొచ్చింది.
కొత్త కాంట్రాక్టు పద్ధతి ప్రకారం బీసీసీఐ ఆటగాళ్లను నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఆ కేటగిరీలు A+, A, B, C గా ఉన్నాయి. అంతకముందు A, B, C మూడు కేటగిరీలుగా మాత్రమే ఉండేవి. ఇప్పుడు టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లు ఆడే ఆటగాళ్లు A+లో చోటు దక్కించుకోనున్నారు. A+ గ్రేడ్ దక్కించుకున్న ఆటగాళ్లకు ఏడాదికి గాను సుమారు రూ.12 కోట్లు ఇవ్వనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ A+ గ్రేడ్ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి చోటు దక్కడం అనుమానమేనని అంటున్నారు. టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని గతంలో కూడా అగ్ర జాబితాలో ఉండటంపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ధోనికి ఏ గ్రేడ్ దక్కడం కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ధోని భారత్ తరుపున పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లోనే ఆడుతున్నాడు. మరోవైపు టెస్టు క్రికెట్ ఆడుతూ వన్డేలు, టీ20ల్లో చోటు దక్కించుకోని పుజారా, అశ్విన్, రవీంద్ర జడేలాలు ఏ గ్రేడ్‌లో ఉంటారనే దానిపై కూడా ఆసక్తి నెలకొంది

Recommended