Hyderabad Love Story Movie Review హైదరాబాద్ లవ్ స్టోరి మూవీ రివ్యూ

  • 6 years ago
Hyderabad love story movie is releasing on February 23rd. This movie is directed by Raj Satya. Producers are ML Raju, RS Kishan, Venu Kodumagulla. Lead actors are Rahul Ravindran, Reshmi Menen. Hyderabad love story movie review brings Telugu Filmibeat brings review exclusively.

యువతరం నటుల్లో టాలెంట్ హీరోగా రాహుల్ రవీంద్రన్‌ పేరు తెచ్చుకొన్నాడు. తన తొలిచిత్రం అందాల రాక్షసితోనే ఆకట్టుకొన్నాడు. సాఫ్ట్ క్యారెక్టర్లు, లవర్ బాయ్‌ పాత్రలతో రాహుల్ తనదైన శైలిలో దూసుకెళ్తున్నాడు. హీరోయిన్లు రేష్మీ మీనన్, జియాతో కలిసి రాహుల్ రవీందన్ నటించిన తాజా చిత్రం హైదరాబాద్ లవ్‌స్టోరీ. ట్రయాంగిల్ లవ్‌స్టోరిగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
భాగీ అలియాస్ భాగ్యలక్ష్మి (రేష్మీ మీనన్) చలాకైన యువతి. మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లో కార్తీక్ (రాహుల్ రవీంద్రన్) ఇంజినీర్‌గా పని చేస్తుంటాడు. తొలిచూపులోనే కార్తీక్, భాగీ ప్రేమలో పడుతారు. భాగీతో ప్రేమలో పడటానికి ముందే కార్తీక్‌కు వైష్ణవి (జియా) అనే యువతితో బ్రేకప్ అవుతుంది. కార్తీక్‌తో పీకల్లోతూ ప్రేమలో మునిగిన భాగీకి వైష్ణవి ఓ భయంకరమైన విషయాన్ని చెబుతుంది. దాంతో కార్తీక్, భాగీకి మధ్య మనస్పర్ధలు వస్తాయి.
కార్తీక్ గురించి భాగీకి వైష్ణవి చెప్పిన భయంకరమైన విషయం ఏమిటి? కార్తీక్, వైష్ణవి మధ్య అఫైర్ ఎందుకు బ్రేకప్ అయింది? కార్తీక్, వైష్ణవి మళ్లీ కలుసుకొన్నారా? కార్తీక్, భాగీ ప్రేమకు ముగింపు ఏమిటీ? కార్తీక్ జీవితంలో అలీ అనే యువకుడి పాత్ర ఏమిటీ? కథలో రావు రమేష్ ఏ విధంగా కీలకంగా మారాడు అనే ప్రశ్నలకు తెరమీద సమాధానమే హైదరాబాద్ లవ్‌ స్టోరీ.
రాహుల్ రవీంద్రన్, రేష్మీ తొలిసారి కలుసుకోవడం, ఆ తర్వాత ప్రేమలో పడటం అనే అంశంతో కథ ప్రారంభమవుతుంది. రాహుల్, రేష్మీ మధ్య ప్రేమ, ఆకర్షణ అంశాలతో లవ్ ట్రాక్‌ను దర్శకుడు రాజ్ సత్య ఆహ్లాదంగా కొనసాగిస్తూనే, దానికి కామెడీ ట్రాక్‌ను మిక్స్ చేశాడు. అయితే కామెడీ ట్రాక్ నాసిరకంగా ఉండటం కారణంగా కథావేగం, స్టోరిలోని ఇంటెన్సిటీని పక్కదారి పట్టించేలా చేసింది. ఓ ఆసక్తికరమైన పాయింట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది

Recommended