IND Vs SA 2nd T20 : Kohli On The Verge Of Breaking Bradman & Richards' Record

  • 6 years ago
Kohli needs to score 130 or more runs to match the West Indian great Richards, only batsman in history to score 1000 or more runs in a single series.

భారత పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ మరో రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంతకీ ఆ రికార్డు ఏమంటే.. విదేశీ గడ్డపై ఓ సిరీస్‌లో ఓ ఆటగాడు వెయ్యికి పైగా పరుగులు సాధించడం. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో వెస్టిండీస్‌కు చెందిన వివ్‌ రిచర్డ్స్‌ మాత్రమే విదేశీ గడ్డపై వెయ్యికి పైగా పరుగులు సాధించాడు. ఇప్పుడు కోహ్లీ ఆ రికార్డుకు చేరువయ్యాడు.
ప్రస్తుతం కోహ్లీ సేన దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు జరిగిన టెస్టు, వన్డే, టీ20ల్లో కలిపి కోహ్లీ చేసిన పరుగులు 870. వెయ్యి పరుగుల మైలు రాయిని అందుకోవడానికి కోహ్లీకి కావాల్సింది ఇంకా 130 పరుగులు. 1976లో వివ్‌ రిచర్డ్స్‌ ఇంగ్లాండ్‌ గడ్డపై 1,045(వన్డేల్లో 216, టెస్టుల్లో 829) పరుగులు సాధించాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఏ ఒక్క ఆటగాడు ద్వైపాక్షిక సిరీస్‌లో విదేశీ గడ్డపై వెయ్యికి పైగా పరుగులు సాధించిన దాఖలాలు లేవు.
1976లో బ్రాడ్‌మెన్‌ రికార్డును సరిచేస్తూ వెయ్యి పరుగులు చేసిన ఆటగాడిగా రిచర్డ్స్ రికార్డులకెక్కాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న కోహ్లీ ఇప్పటి వరకు 870(టెస్టుల్లో 286, వన్డేల్లో 558, ఒక టీ20లో 26) పరుగులు సాధించాడు. మరి రిచర్డ్స్‌ రికార్డును కోహ్లీ తిరగరాస్తాడో? లేదో? తెలియాలంటే 24వరకు వేచి ఉండాల్సిందే.
పర్యటనలో భాగంగా కోహ్లీ సఫారీ గడ్డపై ఇంకా రెండు టీ20 మాత్రమే ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచుల్లో అతడు 130కి పైగా పరుగులు చేస్తే ద్వైపాక్షిక సిరీస్‌లో విదేశీ గడ్డపై వెయ్యి పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు. భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 బుధవారం(21న), మూడోది శనివారం(24న) జరగనున్నాయి.

Recommended