YSRCP MPs Will Resign on April 6th, Chandrababu Reaction
  • 6 years ago
YSRCP president YS Jaganmohan Reddy on Tuesday said that his party MPs will resign on April 6th for Andhra Pradesh Special Status. meanwhile Tdp chief Chandrababu Naidu made allegations on Ysrcp chief Ys Jagan on Tuesday. what is the reason for ysrcp special status protest asked Chandrababu naidu.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక్కటే అని చెప్పిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం తన పాదయాత్రలో సంచలన ప్రకటన చేశారు. నెల్లూరు జిల్లాలోని కలిగిరిలో 86వ రోజు ప్రజాసంకల్ప యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు మార్చి 5 నుంచి ఏప్రిల్ 6 వరకు కొనసాగుతాయని.. ఈ సమావేశాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పోరాటం చేస్తారని అన్నారు.ఒక వేళ ఏప్రిల్ 6 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటన చేయకపోతే.. తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేసి.. వారి మొహన కొట్టేసి వస్తారని జగన్ సంచలన ప్రకటన చేశారు
ప్రత్యేక ప్యాకేజీ పేరుతో చంద్రబాబు డ్రామాలు మొదలుపెట్టారని జగన్ మండిపడ్డారు. కేంద్రాన్ని ప్రత్యేక హోదాను అసలే అగడం లేదని అన్నారు. ప్యాకేజీ ఇవ్వాలని, రూపాయి, పావలా ఇవ్వాలని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.
హోదా తమ హక్కని.. ప్యాకేజీ కోసం ప్రజలను మోసం చేయవద్దని జగన్ అన్నారు. ప్యాకేజీ లంచాల కోసం ఆశ పడవద్దని చంద్రబాబుకు సూచించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా మార్చి 1న వైసీపీ నేతలు, కార్యకర్తలు అన్ని కలెక్టరేట్లు, మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపడతారని అన్నారు.
మార్చి 3న ఎమ్మెల్యేలు, ఎంపీలు తన పాదయాత్రకు వస్తారని జగన్ చెప్పారు. వారందర్నీ తానే జెండా ఊపి మార్చి 5న ఢిల్లీలో ధర్నా చేసేందుకు పంపిస్తానని జగన్ స్పష్టం చేశారు. మార్చి 8న ఢిల్లీలో వైసీపీ నేతలంతా ఢిల్లీ ధర్నాలో పాల్గొంటారని చెప్పారు.
ప్రత్యేక హోదా విషయమై ఆందోళన చేయాలని వైసీపీ తీసుకొన్న నిర్ణయం అవకాశవాద రాజకీయమని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా అంశాన్ని వైసీపీ ఎందుకు ప్రస్తావించలేదని టిడిపి నేతలు ప్రశ్నించారు. మంగళవారం నాడు టిడిపి కోర్‌కమిటీ సమావేశం అమరావతిలో జరిగింది.ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు.రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయమై పోరాటం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.
Recommended