India vs South Africa 5th ODI : Why Spinners are match winners ?| Oneindia Telugu
  • 6 years ago
India has never won a match at this venue, in the five matches they have played here. In this match MS Dhoni requires 5 catches to complete 300 catches in ODI.

ఆరు వన్డేల సిరిస్‌లో వరుసగా మూడు వన్డేల్లో విజయాలు సాధించి మంచి ఊపు మీదున్న కోహ్లీసేనకు నాలుగో వన్డేలో సఫారీ జట్టు షాకిచ్చింది. నాలుగో వన్డేలో సఫారీలు విజయం సాధించడంతో అప్పటివరకు ఏకపక్షంగా సాగిన ఈ సిరిస్‌ ఒక్కసారిగా రసవత్తరంగా మారింది. ఇరు జట్ల మధ్య ఐదో వన్డే మంగళవారం పోర్ట్‌ ఎలిజబెత్‌ సెయింట్ జార్జి పార్క్ స్టేడియంలో జరగనుంది. ఐదో వన్డేలో కోహ్లీసేన విజయం సాధిస్తే సఫారీ గడ్డపై సిరీస్‌ గెలిచిన భారత తొలి జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. అలా జరగని పక్షంలో సిరిస్ ఫలితం ఆరో వన్డేకు మారుతుంది. దీంతో చివరి వన్డేలో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.
డర్బన్‌లో 6 వికెట్లు, సెంచూరియన్‌లో 9 వికెట్లు, కేప్‌టౌన్‌లో 124 పరుగుల తేడాతో ఆతిథ్య సఫారీ జట్టుపై కోహ్లీసేన విజయం సాధించింది. నాలుగో వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
1992 నుంచి ఇక్కడ జరిగిన ఐదు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. అంతేకాదు ఈ నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్కదాంట్లో కూడా 200కు పైగా పరుగులు నమోదు చేయలేకపోయింది. సఫారీ పర్యటనలో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ వైఫల్యం అభిమానులను కలవరపెడుతోంది. ఆరు సార్లు రబాడ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. ఇక, నాలుగో స్థానంలో ఆడుతున్న రహానే తొలి వన్డేలో 79 పరుగులు చేసినా తర్వాత మ్యాచుల్లో 11, 8 మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.
ఒకదాంట్లో అతడికి ఆడే అవకాశం రాలేదు. మరోవైపు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కూడా ఆశించిన మేరకు రాణించడం లేదు. తొలి వన్డేలో 3 నాటౌట్, మూడో వన్డేలో 14, నాలుగో వన్డేలో 9 పరుగులు చేశాడు. ఇక, బౌలింగ్ విషయానికి వస్తే నాలుగు మ్యాచ్‌లు కలిపి ఒక వికెట్ మాత్రమే తీశాడు. ఇప్పటి వరకు జరిగిన నాలుగు వన్డేల్లో కెప్టెన్ కోహ్లీ (393), ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (271)లు మాత్రమే రాణిస్తున్నారు.
ఇక, ఐదో వన్డే జరగనున్న పోర్ట్‌ ఎలిజబెత్‌ స్పిన్నర్ల స్వర్గధామం. ఇక్కడ ఆతిథ్య జట్టు ఆడిన చివరి రెండు వన్డేల్లో స్పిన్నర్లే మ్యాచ్ విన్నర్లుగా నిలిచారు. పోర్ట్‌ ఎలిజబెత్‌లో ఆడిన ఐదు మ్యాచుల్లో భారత్‌ సాధించిన అత్యధిక పరుగులు 176. దక్షిణాఫ్రికాపై 2001లో ఆ పరుగులు సాధించింది. ఈ స్టేడియంలో జరిగిన ఓ మ్యాచ్‌లో టీమిండియా.. కెన్యాపై కూడా ఓటమి పాలైంది. ఇక, సఫారీల విషయానికి వస్తే ఇక్కడ 32 మ్యాచ్‌లు ఆడగా 11 మాత్రమే ఓటమిపాలైంది.
Recommended