Priyanka Chopra Finally Opens Up

  • 6 years ago
The Quantico star Priyanka Chopra, who has always kept her love affairs under the wraps, recently opened up about her relationship status. she currently making it big in Hollywood, revealed that she has always been in a committed relationship

హీరోయిన్ ప్రియాంక చోప్రా రిలేషన్‌షిప్, లవ్ ఎఫైర్ల గురించి ప్రశ్నలు అడిగితే చాలా తెలివిగా సమాధానాలు చెబుతూ ఉంటుంది. తాజాగా ఫిల్మ్‌ఫేర్ మేగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ మాజీ విశ్వసుందరి తొలిసారిగా తన రిలేషన్ షిప్ గురించి ఒప్పుకుంది. తాను ఒక వ్యక్తితో చాలా కమిటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. అయితే సంవత్సరం క్రితమే మేము విడిపోయాము అని తెలిపారు.
సంవత్సర కాలంగా నేను సింగిల్‌గానే ఉంటున్నాను. అప్పటి నుండి చాలా మందిని కలిశాను. వారితో కలిసి తిరిగాను. అయితే వారిలో ఎవరూ ఇప్పటి వరకు నా మనసుకు నచ్చలేదు, మరో వ్యక్తి నా జీవితంలోకి ఇంకా రాలేదు అని ప్రియాంక చోప్రా తెలిపారు.
తొలిసారిగా ప్రియాంక చోప్రా తాను ఒక వ్యక్తితో రిలేషన్ షిప్‌లో ఉన్నాను అని ఒప్పుకోవడంతో ఈ విషయం బాలీవుడ్ సర్కిల్‌లో హాట్ టాపిక్ అయింది. ఈ మాజీ ప్రపంచ సుందరిని పడగొట్టిన ఆ లక్కీ మ్యాన్ ఎవరు? అని చర్చించుకుంటున్నారు. ఇంత లాంగ్ టైమ్ నేను సింగిల్ గా ఎప్పుడూ లేను. దాదాపు సంవత్సరం కంటే ఎక్కువే అయింది. ఇలా ఉండటం కూడా కొత్తగా ఉంది, ఇష్టంగా ఉంది.... అని ప్రియాంక చోప్రా తెలిపారు.
ప్రియాంక చోప్రా ‘క్వాంటికో' సిరీస్, ‘బేవాచ్' హాలీవుడ్ సినిమా కోసం చాలా కాలం అమెరికాలో గడిపింది. పేరు బయట పెట్టక పోవడంతో మరి ఆమె బాయ్ ఫ్రెండ్ భారతీయుడా? యూనైటెడ్ స్టేట్స్ కు చెందిన వాడు అయి ఉంటాడా? అనేది ఎవరికీ అర్థం కావడం లేదు.

Recommended