రాజకీయాల్లోకి నాగార్జున కోడలు ?
  • 6 years ago
Will Actress Samantha Akkineni enter into politics? Some section of social media saying that Samantha may enter into politics and contest from Secunderabad.

ఇటీవల సినిమా తారలు రాజకీయాల్లోకి చాలామంది వస్తున్నారు. దక్షిదిన అయితే ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్, రజనీకాంత్, కమల్ హాసన్‌ల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. మరికొందరు ఆయా రాజకీయ పార్టీలకు మద్దతుగా లేదా వ్యతిరేకంగా కనిపిస్తుంటారు. వారు క్రియాశీలక రాజకీయాల్లో కనిపించారు. టాలీవుడ్ అందగాడు నాగార్జున రాజకీయాల్లో లేరు. కానీ 2014 ఎన్నికలకు ముందు గుజరాత్‌కు వెళ్లడం, అంతకుముందు వైయస్ రాజశేఖర రెడ్డితో చనువు, ఇటీవల కేసీఆర్ - కేటీఆర్‌లతో మంచి సంబంధాలు ఉన్నాయనే వాదనలు ఉన్నాయి. నాగార్జున పేరు ఈ విధంగా ఎక్కువగా వినిపిస్తుంటుంది.
రాజకీయాల్లోకి జయసుధ, జయప్రద వంటి నటీమణులు వచ్చారు. వాణివిశ్వనాథ్ కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆమె టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా, మరో ఆసక్తికరమైన ప్రచారం సాగుతోంది. ఇది నటి సమంత గురించి. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ, ఆమె కూడా రాజకీయాల్లోకి రావొచ్చునని వార్తలు వస్తున్నాయి. అయితే ఇదంతా వట్టిదేనని చాలామంది భావిస్తున్నారు.
అంతేకాదు, సమంత ఎక్కడి నుంచి పోటీ చేస్తుందనేది కూడా పేర్కొంటున్నారు. సమంత సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేయబోతున్నారని పేర్కొంటున్నారు. సికింద్రాబాద్ నియోజకర్గంలో క్రైస్తవ ఓటర్లు ఎక్కువ. అందుకే 2009లో కాంగ్రెస్ జయసుధను అక్కడి నుంచి పోటీ చేయించారు. ఇప్పుడు కౌంటర్‌గా టీఆర్ఎస్ సమంతను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని వార్తలు రావడం గమనార్హం. ఇప్పటికే జయసుధ రాజకీయాలపై అనాసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు దాదాపు లేవు.
Recommended