IPL 2018 : Chennai Super Kings squad Analysis
  • 6 years ago
The strength of the Chennai Super Kings side is the balance that they have maintained while picking up the players. They have the likes of MS Dhoni, Harbhajan Singh, Dwayne Bravo, Suresh Raina, Faf du Plessis, Ravindra Jadeja and all are no stranger to the shortest format.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ వేలం ప్రక్రియ ముగిసింది. దీంతో ఈ సీజన్‌లో ఏయే ఆటగాళ్లు ఏయే జట్టు తరుపున ఆడనున్నారో తెలిసిపోయింది. ఉత్కంఠభరితంగా జరిగిన వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆర్‌టీఎమ్(రైటు టు మ్యాచ్) కార్డ్, రిటైన్డ్(అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు), ద్వారా కలిపి ఫ్రాంచైజీ ఆటగాళ్లను సమకూర్చింది.
అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు( రిటైన్డ్): మహేంద్ర సింగ్ ధోనీ: ₹ 15 కోట్లు, సురేష్ రైనా : ₹ 11 కోట్లు, రవీంద్ర జడేజా: ₹ 7 కోట్లు
ఆర్ టీఎమ్ ద్వారా; డుప్లెసిస్: రూ. 1.6 కోట్లు, డేన్ బ్రావో: రూ. 6.4 కోట్లు, ఇమ్రాన్ తహీర్: రూ. కోటి
వేలం ద్వారా కొనుగోలు చేసిన ఆటగాళ్లు: కేదార్ జాదవ్: ₹ 7.8 కోట్లు, కర్ణ్ శర్మ: ₹ 5 కోట్లు, షేన్ వాట్సన్: ₹ 1 కోట్లు, శార్దుల్ ఠాకూర్: ₹ 2.6 కోట్లు, అంబటి రాయుడు: ₹ 2.2 కోట్లు, హర్భజన్ సింగ్: ₹ 2 కోట్లు, విజయ్ మురళి: ₹ 2 కోట్లు, మార్క్ ఉడ్: ₹ 1.5 కోట్లు, సామ్ బిల్లింగ్స్: ₹ 1 కోటి, దీపక్ చహర్: ₹ 80 లక్షలు, మిచెల్ సాన్నర్: ₹ 50 లక్షలు, లుంగనిని నడి: ₹ 50 లక్షలు, ఆసిఫ్ కె: ₹ 40 లక్షలు
జగదీసన్ నారాయణ్: ₹ 20 లక్షలు, కనిష్క్ సేథ్: ₹ 20 లక్షలు, ధ్రువ్ షోరీ: ₹ 20 లక్షలు, కిషిటి శర్మ: ₹ 20 లక్షలు, మోను సింగ్ : ₹ 20 లక్షలు, చైతన్య బిష్ణోయి: ₹ 20 లక్షలు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బలాలు చూస్తే : చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బలం, ఆటగాళ్లను ఎంచుకునే సమయంలోనే బయటపడింది. MS ధోనీ, హర్భజన్ సింగ్, డ్వేన్ బ్రేవో, సురేష్ రైనా, ఫాఫ్ డు ప్లెసిస్, రవీంద్ర జడేజా లాంటి ప్లేయర్స్ తో జట్టు బలంగా ఉందని చెప్పొచ్చు. అల్రౌండర్ అశ్విన్ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు వదిలెయ్యటం మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయమే . అయితే అదే సమయంలో హర్భజన్ సింగ్ ని 2 కోట్ల రూపాయల కే దక్కించుకోవటం మాత్రం జట్టుకు పెద్ద బలం. గత పది సీజన్లలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడబడిన హర్భజన్ మంచి బౌలర్ గా ఉన్నాడు అలాగే పవర్ప్లే ఓవర్లలో సమర్థవంతంగా పనిచేయగలడు. అంతేకాక మూడు సార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టులో భాగంగా భాగంగా ఉన్నాడు కనుక తన అనుభవాన్ని కూడా వాడుకునే అవకాశం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కి ఉంది
Recommended