Padma awards 2018 : పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ గ్రహీతలు !

  • 6 years ago
Music director Ilaiyaraaja, cricketer Mahendra Singh Dhoni and Badminton Player Kidambi Srikanth are among the 85 personalities named for the 2018 Padma Awards by the Home Ministry.

గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఏటా విద్య, వైద్యం, కళలు, సామాజిక సేవ, సాహిత్యం తదితర రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు 'పద్మ' పురస్కారాలను ప్రకటించి గౌరవించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన పలువురు ప్రముఖులకు 2018 సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం 'పద్మ' అవార్డులను ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాల కోసం మొత్తం 15, 700 మంది దరఖాస్తు చేసుకున్నారు. కళారంగానికి చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, గులాం ముస్తఫా ఖాన్‌తో పాటు సాహిత్యం, విద్యారంగానికి చెందిన పరమేశ్వరన్‌ (కేరళ)ను కేంద్రం పద్మవిభూషణ్‌తో గౌరవించింది. కేంద్రం తనకు పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించిందని తెలియగానే ఇళయరాజా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ప్రకటించిన ఈ అవార్డు మొత్తం దక్షిణ భారతానికే వచ్చినట్లుగా తాను భావిస్తున్నానని చెప్పారు. భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనితో పాటు వివిధ రంగాలకు చెందిన మరో ఎనిమిది మందికి కేంద్రం పద్మభూషణ్‌ అవార్డులు ప్రకటించింది. బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌తో పాటు మరో 73 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది.
విద్యారంగంలో మహరాష్ట్రకు చెందిన శాస్త్రవేత్త అరవింద్‌ గుప్తా, వైద్యరంగంలో కేరళకు చెందిన ఎం.ఆర్‌ రాజగోపాల్‌, లక్ష్మీ కుట్టి, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన యేషి ధోడెన్‌, కర్ణాటకకు చెందిన సలగత్తి నరసమ్మ, కళారంగంలో మధ్యప్రదేశ్‌కు చెందిన భజ్జు శ్యామ్‌, మహారాష్ట్రకు చెందిన విజయలక్ష్మీ నవనీత కృష్ణన్‌, సామాజిక సేవా రంగంలో బంగాల్‌కు చెందిన 98 ఏళ్ల సుధాన్షు బిశ్వాస్‌, సుభాషిణి మిస్త్రీ, క్రీడారంగంలో మహారాష్ట్రకు చెందిన మురళీకాంత్‌ పేట్కర్‌, సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ రంగంలో తమిళనాడుకు చెందిన రాజగోపాలన్‌ వాసుదేవన్‌ తదితరులను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది.

Recommended