MS Dhoni honoured with Padma Bhushan Award by President Ram Nath Kovind
  • 6 years ago
Former India cricket team captain Mahendra Singh Dhoni and multiple world-champion cueist Pankaj Advani received the country's third highest civilian award, Padma Bhushan, from President Ram Nath Kovind at the Rashtrapati Bhavan on Monday.


టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, బిలియర్డ్స్ ప్లేయర్ పంకజ్ అద్వానీలు పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ధోనితో పాటు బిలియర్డ్స్‌ చాంపియన్‌ పంకజ్‌ అద్వానీ ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు.
ఈ కార్యక్రమానికి ధోని కుటుంబ సమేతంగా హాజరయ్యారు. లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా కలిగిన ధోని ఆర్మీ దుస్తుల్లోనే కవాతు చేస్తూ రాష్ట్రపతి దగ్గరకు వెళ్లి మరీ అవార్డు స్వీకరించారు. ఇక ధోని అవార్డు అందుకుంటుండగా అతని భార్య సాక్షిసింగ్‌ నవ్వుతూ సంతోషం వ్యక్తం చేసారు.
భారత క్రికెట్‌కు ధోని చేసిన సేవలకు గాను ఇంతకముందే భారత ప్రభుత్వం పద్మ శ్రీతో సత్కరించింది. ఇప్పుడు దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్‌తో సత్కరించింది. ధోని జీవితంలో ఈ రోజు(ఏప్రిల్ 2)కు ఎంతో ప్రత్యేకత ఉంది. సరిగ్గా ఏడేళ్ల కిందట ఇదే రోజున టీమిండియాకు ధోని వరల్డ్‌కప్ అందించాడు.
దీంతో ఏప్రిల్‌ 2 ధోనికి అతని అభిమానులకు ఓ ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోయింది. భారత్‌కు రెండు వరల్డ్ కప్‌లను అందించిన ఏకైక కెప్టెన్‌గా ధోనికి పేరుంది. ధోనితో పాటు బిలియర్డ్స్‌లో 18సార్లు వరల్డ్ చాంపియన్ అయిన పంకజ్ అద్వానీకి కూడా పద్మభూషణ్ స్వీకరించాడు.
Recommended