WEF 2018 : PM Modi Speech
  • 6 years ago
WEF 2018: Watch PM Modi Speech at World Economic Forum. The five-day World Economic Forum (WEF) affair seems to be bigger this year

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2018లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ఇరవై ఏళ్ల తర్వాత భారత ప్రధాని దావోస్ వేదికపై మాట్లాడారు. దావోస్ వేదికపై కడసారి 1997లో దేవేగౌడ ప్రసంగించారని మోడీ తన ప్రసంగంలో గుర్తు చేశారు. 1997లో భారత భారత జీడీపీ 400 బిలియన్ డాలర్లు మాత్రమే అన్నారు. ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయని చెప్పారు. టెక్నాలజీ ప్రజల జీవితాలను పూర్తిగా మార్చి వేసిందన్నారు.
ప్రపంచ దేశాలు అభివృద్ధి దిశలో పయనించేలా సదస్సు దోహదపడుతుందని చెప్పారు. ఇరవై ఏళ్ల కిందటికి ఇప్పటికి భారత జీడీపీ ఆరు రెట్లు పెరిగిందని చెప్పారు. భారత్‌లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
సైబర్ పరిజ్ఞానాన్ని చెడుకు వినియోగించకుండా నియంత్రించడం సవాలుగా మారిందన్నారు. ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబమని చెప్పారు. పరస్పర ఆధారిత సమాజ అభివృద్ధిలో ఆర్థిక సదస్సు చుక్కానిగా వ్యవహరిస్తోందన్నారు. సాంకేతిక పరంగా ఇంటర్నెట్, బిగ్ డేటాతో ప్రపంచమంతా అనుసంధానం అవుతోందని చెప్పారు. మన మాట, పని, చేతలను అన్నింటిని సాంకేతికత ప్రభావం చేస్తోందన్నారు. వసుదైవ కుటుంబం అనే భావనను భారత్ ప్రపంచానికి ఎప్పుడో చాటి చెప్పిందన్నారు. వసుదైవ కుటుంబం భారత తాత్విక చింతన అన్నారు.

Recommended