అందుకే కొత్త పార్టీ.. ఆ ఇద్దరి బండారం బట్టబయలు చేస్తా..!

  • 6 years ago
After losing claim over AIADMK and its two leaves poll symbol, sidelined party leader and RK Nagar MLA TTV Dhinakaran on Tuesday announced that he would take a call on floating a political outfit on the birth anniversary of former chief minister MG Ramachandran on January 17.

తమిళనాట రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకవైపు సినీ నటులు రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ రాజకీయాల్లోకి వచ్చేందుకు వేగంగా సన్నాహాలు చేస్తుండగా.. మరోవైపు శశికళ వర్గం కూడా సొంత కుంపటి పెట్టేదిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించిన టీటీవీ దినకరన్‌ సొంత పార్టీ పెట్టే దిశగా వేగంగా కదులుతున్నారు. తన మద్దతుదారులతో చర్చించి త్వరలోనే కొత్త పార్టీని ప్రకటిస్తానని తాజాగా బుధవారం దినకరన్‌ వెల్లడించారు.
అన్నాడీఎంకే పార్టీని, రెండాకుల గుర్తును కాపాడుకోవడానికే కొత్త పార్టీని పెట్టాలని భావిస్తున్నట్టు టీటీవీ దినకరన్‌ తెలిపారు. రెండాకుల గుర్తును కచ్చితంగా సొంతం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అన్నాడీఎంకేకు చెందిన 90 శాతం కేడర్ తనవైపే ఉందని టీటీవీ దినకరన్‌ ధీమా వ్యక్తం చేశారు. అందువల్ల రాబోయే రోజుల్లో తమిళనాడులో కచ్చితంగా తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు..
తాను పెట్టబోయే కొత్త రాజకీయ పార్టీలో ఓపీఎస్, ఈపీఎస్‌లకు తప్ప అందరికీ స్థానం ఉంటుందని టీటీవీ దినకరన్ వ్యాఖ్యానించారు.
తమిళనాడులో ప్రస్తుత ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని దినకరన్ జోస్యం చెప్పారు. ఓపీఎస్‌ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే.. అన్నాడీఎంకేలోని స్లీపర్ సెల్స్‌ బయటకు వస్తారని తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలను ఉద్దేశించి అన్నారు.

Recommended