బాబుకు కలిసొచ్చిన ట్రిపుల్ తలాఖ్ బిల్లు

  • 6 years ago
PM Narendra Modi is likely to seek the support of AP Chief Minister N. Chandrababu Naidu in getting the triple talaq Bill passed in Parliament in its present form.

ట్రిపుల్ తలాఖ్ బిల్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కలిసి వచ్చినట్లే ఉంది. ఆ బిల్లును రాజ్యసభలో ఆమోదింపజేసుకోవాల్సిన అవసరం మోడీకి ఏర్పడింది. రాజ్యసభలో తగిన బలం లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వానికి కష్టంగా మారింది. దీంతో మోడీ చంద్రబాబు సాయం కోరాలని అనుకుంటున్నారు. దీన్ని చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా కాలంగా మోడీతో భేటీకి ఎదురు చూస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా చంద్రబాబు మోడీని కలవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం ట్రిపుల్ తలాఖ్ బిల్లు చంద్రబాబుకు కలిసిన వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నెల 12వ తేదీన లేదా 17వ తేదీన చంద్రబబు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది.
ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు చంద్రబాబు మెలిక పెడుతన్నారు. ట్రిపుల్ తలాఖ్ బిల్లును పూర్తిగా వ్యతిరేకించకుండా దాన్ని నేరంగా పరిగణించడాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. బిల్లులో మార్పులు చేయకుండా ట్రిపుల్ తలాఖ్ బిల్లును రాజ్యసభలో ఆమోదింపజేసుకోవాలని కేంద్రం ఆలోచనగా ఉంది. అందువల్ల చంద్రబాబుతో భేటీలో మోడీ అందుకు సహకరించాలని అడిగే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రానికి ఎదరువుతున్న పోలవరంతో పాటు ఇతర సమస్యలను మోడీ చంద్రబాబు ముందు పెట్టే అవకాశం ఉంది.

Recommended