Chandrababu Naidu Against To No-Trust Motion
  • 6 years ago
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu on Monday said he was ready to move a no-trust motion against the Centre, but such a move will be his last step

కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం విషయంలో తాము ముందుండి లీడ్ తీసుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇష్టం లేదా?...అంటే అవుననే చంద్రబాబు తాజా వ్యాఖ్యలను బట్టి స్పష్టంగా అర్థమవుతోంది.ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌ అవిశ్వాస తీర్మాన గురించి చంద్ర బాబు స్పందిస్తూ "అయినా అవిశ్వాసం పెట్టాల్సివస్తే ఆ విషయంలో తాను లీడ్‌ తీసుకుంటాననీ దీనికి ప్రతిపక్షం సహకరించాలని, అంతేగానీ జగన్ నేను వస్తాను...మీరు నా వెనుక రండి అనడంలో ఆంతర్యమేమిటని "చంద్రబాబు ప్రశ్నించారు.ఈ సమయంలో రాజీనామాలు చేసేసి వస్తే, పార్లమెంట్‌లో పోరాడే వ్యక్తులు కూడా ఉండరని చంద్రబాబు అన్నారు..మెజారిటీ ఉన్నాక అవిశ్వాసం పెడితే ఆరునెలలు మళ్లీ ఆ విషయంపై అసలు మాట్లాడే అవకాశం కూడా ఉండదని చంద్రబాబు గుర్తుచేశారు.అయినా అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది చిట్టచివరి చర్యగా ఉండాలన్నారు.
"29సార్లు ఢిల్లీ వెళ్లా, రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి చర్చించా. సమస్యలు పరిష్కరించాలని కోరా. రెండు గంటలు కేటాయించమని ప్రధానికి విజ్ఞపి చేశా. అయినా, పనేలేవి కాలేదు' అని చంద్రబాబు తేల్చి చెప్పేశారు. 'పునర్‌ వ్యవస్థీకరణ చట్ట ప్రకారం నిధులు ఇవ్వాలని మేం కోరుతుంటే...వారు ఉపాధి హామీ నిధుల గురించి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మనకు 54 మంది ఎంపీలు ఉంటే తప్ప అవిశ్వాసం పెట్టలేమని, అలాంటప్పుడు అవసరమైతే కొన్నిపార్టీ ఎంపీల సహకారం తీసుకుని న్యాయం జరిగే వరకు గట్టిగా పోరాడాలే తప్ప రాజీనామాలు, అవిశ్వాస తీర్మానం వల్ల ప్రయోజనం ఉండదని చెప్పారు.
Recommended