హైకోర్టు విభజన పై రచ్చ ! ap లో త్వరలోనే !

  • 6 years ago
TRS MP AP Jithender Reddy demanded that separate high court for Telangana. He was raised this issue in Loksabha on Thursday.Union minister Sujana chowdary also demanded to fulfill promises as per act to Andhra Pradesh.


హైకోర్టు విభజనపై పార్లమెంట్‌లో గురువారంనాడు మరోసారి టిఆర్ఎస్ ప్రస్తావించింది.టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత జితేందర్ రెడ్డి మరోసారి ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే అమరావతితో హైకోర్టు ఏర్పాటుకు చంద్రబాబునాయుడు సానుకూలంగా స్పందించారని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. హైకోర్టు కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భవనాలను అన్వేషిస్తోందని... ఈ మేరకు ప్రతిపాదనలు పంపుతున్నట్లు తమకు తెలిసిందన్నారు రవిశంకర్ ప్రసాద్. అలాగే విభజన చట్టం ప్రకారం ఏపీలో కొత్త హైకోర్టును త్వరలోనే ఏర్పాటు చేస్తామని రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు.

అయితే అంతకుముందు టిఆర్ఎస్ ఎంపీల వాదనపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారంగా ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు పలు అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన చెప్పారు.ఈ సమస్యలన్నింటిని పరిష్కరించాలని ఆయన కోరారు. రెండు రాష్ట్రాలు తమ మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ సూచించారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం కూడ సహయం చేస్తోందని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

Recommended