AP Fiber Grid Inauguration : Ram Nath Kovind, Chandrababu Speech

  • 6 years ago
With the ambitious aim of providing Internet connection along with telephone and tv channels to every household in Andhra Pradesh, Indian president ramnath kovid launched AP Fiber Grid in Amaravathi on wednesday. This project includes setting up a state-wide high speed optical fiber infrastructure utilising the existing assets of the electricity transmission/ distribution companies such as electrical poles and sub-stations.

ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ శతాబ్ది వేడుకలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. అనంతరం పర్యటనలో భాగంగా ఫైబర్ గ్రిడ్‌ను ప్రారంభించారు. గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు సహా ఏపీ స్పీకర్, మంత్రులు, ఎంపీలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 9.35 నిమిషాలకు రాష్ట్రపతి దంపతులు గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. దేశ ప్రధమ పౌరుడైన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులకు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికారు.

ప్రపంచమంతా వినియోగిస్తున్న అతిముఖ్యమైన మూడు డిజిటల్ సేవలను ఒకే వేదికగా ఎపి ప్రభుత్వం అతి తక్కువ ధరకే రాష్ట్ర ప్రజలకు అందుబాటులో తెస్తుంది. ఫైబర్ గ్రిడ్ పేరుతో ఈ ముఖ్యమైన మూడు సేవలను అనుసంధానం చేసి ఎపి ప్రభుత్వం ప్రజలకు అందిస్తోంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిద్ చేతుల మీదుగా ఈ ఫైబర్ గ్రిడ్ ప్రారంభమైంది.కేవలం 149 రూపాయలకే టివి ఛానెళ్లు,ఇంటర్నెట్,మొబైల్ సేవలు ఈ మూడింటిని ఎపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందించనుంది


Recommended