India vs Sri Lanka : వన్డేల్లో 100 సార్లు 300 కి పైగా పరుగులు, అగ్రస్ధానంలో భారత్

  • 6 years ago
India became first team to register scores of 300 or above for the 100th time in one-day internationals.

మొహాలి వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 392 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ 208 , శ్రేయాస్ అయ్యర్ 88, ధావన్ 68 పరుగులు చేశారు.
ఈ మ్యాచ్‌తో టీమిండియా వన్డేల్లో మొత్తంగా 300పైచిలుకు స్కోరు చేయడం ఇది వందోసారి. 1996లో షార్జా వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్, నవజ్యోత్ సింగ్ సిద్ధూలు సెంచరీలు సాధించడంతో తొలిసారి 305తో టీమిండియా ఈ మార్క్‌ని అందుకుంది.
చివరగా ఇటీవల న్యూజిలాండ్‌పై కాన్పూర్ వేదిక జరిగిన వన్డేలో 337 పరుగులు చేసింది. ఈ వన్డేలోనూ రోహిత్ శర్మ 147 పరుగులు చేయగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (113) పరుగులు చేసి సెంచరీలతో మెరిశారు. ఇప్పుడు మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా 300పైచిలుకు పరుగులు చేసింది.

Recommended