India vs Sri Lanka 2nd ODI : Rohit Sharma’s record 3rd double ton
  • 6 years ago
India captain Rohit Sharma smashed his third double century against Sri Lanka in the second ODI in Mohali on Wednesday.

శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్ శర్మ విజృంభించాడు. ద్విశతకాన్ని నమోదు చేసి మూడుసార్లు డబుల్ సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్‌ శర్మ లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. సెంచరీ అనంతరం రోహిత్‌ శర్మ మరింత దూకుడుగా ఆడాడు. మొత్తం 151 బంతుల్లో 13 4 లు 12 సిక్సర్లతో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. లక్మల్‌ బౌలింగ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 44 ఓవర్‌లో నాలుగు సిక్సులు బాదిన రోహిత్ శర్మ ప్రదీప్ వేసిన 45వ ఓవర్‌లో మరో రెండు సిక్సులు బాదాడు. దీంతో 133 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేశాడు. అంతకముందు 112 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో సెంచరీ సాధించాడు. ఇంతకు ముందు భారత ఆటగాళ్ళలో సచిన్, వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే డబుల్ సెంచరీలు సాధించారు. రోహిత్ సాధించిన ఈ అరుదైన రికార్డుతో స్టేడియంలోని అభిమానులు ఆనందంతో తాండవం చేశారు. రోహిత్ శర్మపై ప్రశంసల జల్లు కురిపిస్తున్న్నారు. మరోవైపు రోహిత్‌ శర్మ భార్య కూడా రోహిత్‌ డబుల్ సెంచరీ కోసం ఎంతో ఉద్వేగంగా ఎదురుచుసారు. ఎట్టకేలకు అందరి ఆశల్ని నెరవేరుస్తూ రోహిత్ డబుల్ టన్ సాదించాడు. 208 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచిన రోహిత్ శర్మ అద్భుత బ్యాటింగ్ తో టీం ఇండియా స్కోర్ 392 గా నిలిచింది. 50 ఓవ‌ర్లు పూర్త‌య్యేస‌రికి నాలుగు వికెట్లకు 392 ప‌రుగులు చేసింది. వ‌న్డే ఫార్మాట్‌లో మూడు డ‌బుల్ సెంచ‌రీలు సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శ‌ర్మ నిలిచాడు.
Recommended