Virender Sehwag Double Century (219) On This Day | Oneindia Telugu

  • 6 years ago
Virender Sehwag became the second batsman to score 200 runs in an One-Day international, when he smashed 219 against West Indies in Indore.

ఆరు సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అద్భుతం చేసాడు. వెస్టిండిస్ బౌలర్లపై విరుచుకుపడి ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
అంతేకాదు వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా సెహ్వాగ్ అరుదైన గుర్తింపు పొందాడు. సెహ్వాగ్‌కు ముందు సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 8, 2011లో ఇండోర్‌ వేదికగా విండిస్‌తో జరిగిన నాలుగో వన్డేలో సెహ్వాగ్‌ 149 బంతుల్లో 25 ఫోర్లు, 7 సిక్సులతో 219 పరుగులు చేశాడు.
దీంతో ఆ మ్యాచ్‌లో భారత్ 418 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసిన ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండిస్‌పై 153 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.

Recommended