Neech Aadmi Remark : Mani Shankar Aiyar was suspended | Oneindia Telugu

  • 6 years ago
Senior Congress leader Mani Shankar Aiyar was suspended from primary membership of Congress Party on Thursday after sparking controversy by calling Prime Minister Narendra Modi a 'neech aadmi'(low-level person).

గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు నేత మణిశంకర్ అయ్యర్ కొత్త వివాదానికి పురుడు పోశారు. ప్రధాని నరేంద్ర మోడీపై మర్యాదరహితమైన పదప్రయోగం చేసి వివాదంలో చిక్కుకున్నారు.
మోడీని నీచ్ ఆద్మీ అని ఆయన అభివర్ణించడం వివాదానికి దారి తీసింది. అయ్యర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పందించారు. అయ్యర్‌ వ్యాఖ్యలను తప్పుబట్టారు. బీజేపీ, ప్రధాని తప్పుడు మాటలు ఉపయోగిస్తూ కాంగ్రెస్‌ను నిత్యం విమర్శిస్తుంటారని, అది వారి సంస్కారంమని, కాంగ్రెస్‌ పార్టీకి ప్రత్యేక సంస్కారం, వారసత్వం ఉందని అన్నారు. మణిశంకర్‌ అయ్యర్‌ ప్రధాని మోడీని సంబోధించిన తీరును తాను సమర్థించబోనని, కాంగ్రెస్‌ పార్టీ, తాను కూడా వెంటనే మోడీకి క్షమాపణలు చెప్పాలని కోరుతున్నామని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.
రాహుల్ గాంధీ సూచన మేరకు మణిశంకర్‌ వెంటనే మోడీకి క్షమాపణలు చెప్పారు. తనకు హిందీ సరిగా రాదని, అందుకే తప్పులు దొర్లాయని అంటూ అందుకు మన్నించాలని కోరారు.

Recommended