Dhoni's Another Angle Revealed By This Cricketer

  • 6 years ago
Suresh Raina, who has shared the dressing room with MS Dhoni during his tenure with the Indian national cricket team and at Chennai Super Kings, spilled the beans while speaking to Gaurav Kapur in an interactive session on ‘Breakfast with Champions.’

అభిమానులు అనుకుంటున్నట్లు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మిస్టర్ కూల్ కాదంట. ఈ విషయాన్ని ధోనికి అత్యంత సన్నిహితంగా మెలిగిన జట్టులోని సహచర ఆటగాడు సురేశ్ రైనా వెల్లడించాడు. 'బ్రేక్‌ ఫాస్ట్‌ విత్‌ ఛాంపియన్స్‌' అనే వెబ్‌ సిరీస్‌లో ధోని గురించి రైనా మాట్లాడుతూ మైదానంలో ఎంతో ప్రశాంతంగా కనిపించే ధోనిని చూసి అందరూ మిస్టర్‌ కూల్‌ అనుకుంటారు కానీ ధోని నిజానికి మిస్టర్‌ కూల్‌ కాదని అన్నాడు.
ధోని మైదానంలో దేని గురించి ఆలోచిస్తాడో ఎవరికీ అర్ధం కాదు. మ్యాచ్‌ మధ్యలో అతనికి కోపం వచ్చినప్పటికీ దానిని కనిపించనివ్వడు. ఓవర్‌ ముగిశాక టీవీల్లో ఎప్పుడైతే ప్రకటనలు మొదలవుతాయో అప్పుడు మాత్రం తన కోపాన్ని ప్రదర్శిస్తాడు. ఇది టీవీల్లో కనిపించదు. అందుకే అందరూ ధోనిని మిస్టర్‌ కూల్‌ అంటుంటారు' అని రైనా తెలిపాడు.ఇందుకు సంబంధించి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జరిగిన సంఘటనను రైనా ఈ సందర్భంగా ప్రస్తావించాడు. 'ఒకసారి భారత్‌-పాక్ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగినప్పుడు ఉమర్‌ అక్మల్‌ నాపై ధోనికి ఫిర్యాదు చేశాడు. ధోని వచ్చి ఏం జరిగింది అని నన్ను అడిగాడు. పాక్‌ ఆటగాళ్ల మీద ఒత్తిడి పెంచేందుకు బంతులు విసురుతున్నాను అని చెప్పాను' అని పేర్కొన్నాడు.ఇందుకు ధోని ఏమన్నాడో తెలుసా... మరిన్ని ఎక్కువ బంతులు విసిరి వారిపై ఒత్తిడి పెంచు అని అన్నాడు. ధోని మ్యాచ్‌ను ఎంతో బాగా అర్ధం చేసుకుంటాడు. మ్యాచ్‌ జరిగే సమయంలో ఏం జరుగుతుందో ముందే పసిగెట్టేస్తాడు. అతని వద్ద ఎప్పుడూ మూడు ప్లాన్‌లు ఉంటాయి. ప్లాన్‌-ఎ, ప్లాన్‌-బి, ప్లాన్‌-సి' అని వెల్లడించాడు.

Recommended