మెంటల్ మదిలో మూవీ పబ్లిక్ టాక్
  • 6 years ago
Mental Madhilo is a Telugu romantic drama. Produced by Pellichoopuli fame Raj Kandukuri under Dharmapatha Creations, written and directed by Vivek Athreya. Raj Kandukuri.

విభిన్నమైన కథా చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయం ఎప్పటికప్పుడు రుజువు అవుతున్నది. ఈ మధ్యకాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న చిత్రాలు కూడా భారీ సినిమాలను తలదన్నేలా సక్సెస్ సాధించాయి. అంతేకాకుండా భారీ కలెక్షన్లను కొల్లగొట్టాయి. అలాంటి చిత్రాల జాబితాలో పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి, ఫిదా లాంటి చిత్రాలు చోటు సంపాదించుకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో విడుదలకు ముందే మరో చిన్న చిత్రం 'Mental మదిలో' విశేషమైన టాక్‌ను సంపాదించుకొన్నది.
పెళ్లిచూపుల లాంటి ఫీల్‌గుడ్ చిత్రాన్ని రూపొందించిన నిర్మాత రాజ్ కందుకూరి మెంటల్ మదిలో సినిమాకు ప్రొడ్యూసర్. అలాంటి నిర్మాత చేతిలో అశ్లీలం, ద్వందార్థాలకు ఎక్కడా తావులేకుండా చక్కటి కుటుంబ కథా చిత్రంగా రూపొందుకున్నది మెంటల్ మదిలో. దీనికి సంబందించి దర్శకుడు మాట్లాడుతూ ..మిమ్మల్ని ఎప్పుడు డిసప్పోయింట్ చేయను.అని అన్నారు..
ఈ సినిమా లో అన్ని ప్లస్ పాయింట్ లే తప్పా..చెప్పుకోడానికి ఒక్క మైనేస్ కూడా లేదు..ఓవర్ అల్ గా సినిమా సూపర్బ్ గా వుంది అని టాక్ వినిపిస్తుంది.
Recommended