చైతన్య-సమంత వెడ్డింగ్ రిసెప్షన్లో సినీ తారల సందడి

  • 6 years ago
Naga Chaitanya - Samantha Wedding Reception hels at N Convention center, Hyderabad. Nagarjuna has waited for more than a month to get the chance to host a grand reception party on the eve of his son Naga Chaitanya's wedding with Samantha Akkineni. The couple got married on 6th and 7th October, in Goa in Hindu and Christian traditions

నాగ చైతన్య, సమంతల వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం సాయంత్ర వైభవంగా జరిగింది. సినీ పరిశ్రమలోని ప్రముఖులంతా ఈ వేడుకకు హాజరయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, కృష్ణంరాజు, రాఘవేంద్రరావు, నందమూరి హరికృష్ణ, రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి, హీరో కార్తీ, జయసుధ, నరేష్ ఇంకా ప్రముఖులంతా హాజరై సందడి చేశారు.
నాగ చైతన్య, సమంత వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి.
సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల, నరేష్ తదితరులు,నందమూరి హరికృష్ణ,రమా రాజమౌళి దంపతులు,రామ్ చరణ్ తదితరులు,టాలీవుడ్ నవ్వుల డాన్ బ్రహ్మానందం,అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతులు,నేచురల్ స్టార్ నాని, మెగా హీరో వరుణ్ తేజ్..ఇంకా ప్రముఖులంతా హాజరై సందడి చేశారు.
అయితే నందమూరి బాలకృష్ణ ఈ వేడుకలో కనిపించకపోవడంతో మళ్లీ వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే అంశం మరోసారి మీడియాలో నానుతున్నది.
టాలీవుడ్‌లో నందమూరి, అక్కినేని కుటుంబాల మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. కుటుంబ పరంగానూ, ఫ్యాన్స్ పరంగానూ ఎలాంటి గందరగోళం లేకుండా చూసుకొన్నారు.

Recommended