Naga Chaitanya New Movie Launch నాగ చైతన్య ప్రేమకథ..!
  • 6 years ago
Leading production house Sithara Entertainments has launched its Production No 3 today featuring Naga Chaitanya Akkineni & Anu Emmanuel in lead roles, Directed by Maruthi Dasari.

నాగ చైతన్య అక్కినేని , దర్శకుడు మారుతి ల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్' ప్రొడక్షన్ నంబర్ 3 ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయింది.
నాగ చైతన్య అక్కినేని సరసన 'అను ఇమ్మాన్యు యేల్' నాయికగా నటిస్తున్నారు. మంచిరోజు కావటం తో 25 న ఈ చిత్రం పూజ కార్య క్రమాలు నిర్వహించటం జరిగింది.
ఈ చిత్రానికి అనగనగా ఓ ప్రేమకథ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి నిర్మాతలు దిల్ రాజు, పీ రాధాకృష్ణ తదితరులు హాజరయ్యారు.
పూజా కార్యక్రమంలో చైతూ, అను ఇమ్మాన్యుయేల్, మారుతి పాల్గొన్నారు. అనంతరం చైతన్య, అనుపై తొలిషాట్‌కు దిల్ రాజు క్లాప్ కొట్టారు.
జనవరి 5 నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని ఈ చిత్రానికి సంభందించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని దర్శకుడు మారుతి తెలిపారు.
Recommended