Indian Cricketer Tested Positive For Doping డోపింగ్‌లో దొరికిపోయిన భారత క్రికెటర్ | Oneindia Telugu

  • 7 years ago
The World Anti-Doping Agency (WADA) report of 2016 has revealed that one Indian cricketer has tested positive for banned substances among the 153 BCCI accreditated cricketers.
భారత్‌కు చెందిన ఓ క్రికెటర్ డోప్ టెస్టులో దొరికిపోయాడు. ఈ విషయాన్ని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(వాడా) తాజాగా స్సష్టం చేసింది. 2016 డోపింగ్ టెస్టుల్లో భాగంగా నివేదిక విడుదల చేసిన వాడా, ఒక భారత క్రికెటర్ గతేడాది నిషేధిత ఉత్ప్రేరకం వాడినట్లు వాడా తన నివేదికలో పేర్కొంది. అయితే ఆ క్రికెటర్ ఎవరనేది మాత్రం పేర్కొనలేదు. టోర్నీ సందర్భంగా మొత్తం 138 మంది బీసీసీఐ అనుబంధ క్రికెటర్లకు డోప్‌ టెస్ట్‌ నిర్వహించగా అందులో ఒకరు దోషిగా తేలినట్టు ఆ నివేదిక పేర్కొంది. దేశవాళీ మ్యాచ్‌ల సందర్భంగా ఆటగాళ్ల నుంచి సేకరించిన శాంపిల్స్‌ను పరీక్షించగా అందులో ఒకరు డోపీగా తేలినట్లు వాడా పేర్కొంది.
డోపింగ్‌లో ఓ భారత క్రికెటర్ దొరకడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గతంలో 2013లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు ప్రదీప్‌ సంగ్వాన్‌ డోప్ టెస్టులో పట్టుబడిన విషయం తెలిసిందే.
అయితే, ఆ క్రికెటర్ ఎవరో తెలుసుకునేందుకు బీసీసీఐని సంప్రదించగా వాడా నుంచి తమకు ఎలాంటి నివేదిక అందలేదని, ప్రస్తుతానికి ఆ క్రికెటర్ ఎవరో తమకు కూడా తెలియదని బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

Recommended