NTR Ready With his Reality Show Bigg Boss

  • 7 years ago
On the 16th of July, Telugu television market will be scaling new heights with the launch of the biggest ever reality show, “Bigg Boss” on Star Maa, with Young Tiger NTR appearing as the host for the first time on the small screen.


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్న బుల్లితెర రియాల్టీ షో 'బిగ్ బాస్' ప్రారంభ తేదీ, షెడ్యూల్ ఖరారైంది. జులై 16 నుండి స్టార్ మాటీవీలో ఈ షో ప్రసారం కాబోతోంది. సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు, శని-ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు ఈ షో ప్రసారం అవుతుంది. 12 మంది సెలబ్రిటీలు పాల్గొనే ఈ రియాల్టీ షో ప్రత్యేకంగా నిర్మించిన బిగ్ బాస్ హౌస్ లో జరుగుతుంది. అందరినీ అందులోకి పంపి లాక్ చేస్తారు. 70 రోజుల పాటు వారు అందులో బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండాల్సి ఉంటుంది. వారి కదలికలను 70 కెమెరాలతో పర్యవేక్షిస్తుంటారు.

Recommended