ఐటీ హబ్ లో ఉబర్, ఓలా, ర్యాపిడో సర్వీసులు బంద్, కాదని నడిపితే కఠిన చెర్యలు తప్పవు *National
  • 2 years ago
Karnataka Transport Department asked Ola, Uber, Rapido to stop the services from Wednesday - Transport Commissioner THM | ఐటీ హబ్ బెంగళూరులో ఉబర్, ఓలా, ర్యాపిడో క్యాబ్ లు, ఆటో సర్వీసులు పూర్తిగా నిలిపివేయాలని కర్ణాటక రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం నుంచి ఉబర్, ర్యాపిడో, ఓలా సర్వీసులు నడిపితే చట్టపరంగా చర్చలు తీసుకుంటామని రవాణా శాఖ ప్రధాన కార్యదర్శి కుమార్ హెచ్చరించారు. ఓలా, ర్యాపిడో, ఉబర్ పంచాయితీ తారాస్థాయికి చేరడంతో ఆ సంస్థల ప్రతినిధులు బిత్తరపోయారు. ఓలా, ఉబర్, ర్యాపిడో య్యాప్ తో క్యాబ్ లు, ఆటోలు నడుపుతూ సామాన్య ప్రజల నుంచి అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేసి వారిని నిలువు దోపిడీ చేస్తున్నారని, ఈ కారణంగా సామాన్య ప్రజలు, డ్రైవర్లు కూడా నష్టపోతున్నారని రవాణా శాఖ అధికారులు అంటున్నారు. రవాణా శాఖ అధికారులు క్యాబ్ లు, ఆటోలు సీజ్ చేస్తున్నారు. ప్రభుత్వ రవాణా శాఖ నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తంలో ఓలా, ఉబర్, ర్యాపిడో క్యాబ్ లు, ఆటో డ్రైవర్లు డబ్బులు వసూలు చేస్తున్నారని కర్ణాటక రవాణా శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు.



#Bengaluru
#Karnataka
#Ola
#Rapido
#Uber
Recommended