యాదాద్రిలో కన్నుల పండువగా మహాకుంభ సంప్రోక్షణ ఘట్టాలు
  • 2 years ago
యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి మహాకుంభసంప్రోక్షణ ఘట్టాలు నేత్ర పర్వంగా సాగుతున్నాయి. బాలాలయంలో సాయంత్రం 6 గంటలకు నిత్య ఆరాధనలు పూర్తయ్యాక సామూహిక శ్రీవిష్ణుసహస్రనామ పారాయణం చేశారు. తర్వాత యాగశాలలో ద్వారతోరణ ధ్వజకుంభారాధనలు, మూల మంత్ర, మూర్తిమంత్ర హవనాలు నిర్వహించారు. ప్రధానాలయంలో దేవతామూర్తుల విగ్రహాలకు పంచగవ్యాధివాసం పర్వాన్ని అర్చకులు, పారాయణికులు, వేదపండితులు వైభవంగా నిర్వహించారు. యాగశాలలో నిత్య లఘు పూర్ణాహుతి నిర్వహించి మూడోరోజు పూజలను పూర్తి చేశారు. ప్రధానాలయంలో 108 మంది రుత్వికులతో మూలమంత్ర, మూర్తిమంత్ర జపాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవి ఈ నెల 28 వరకు కొనసాగనున్నాయి. అప్పటివరకు మొత్తం 11 కోట్ల లక్ష్మీనరసింహ మూలమంత్ర, మూర్తిమంత్ర జపాలు పూర్తి చేయనున్నట్లు ఆలయ ప్రధానార్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు తెలిపారు.
Recommended