C Kalyan : ఒక్కడితో సక్సెస్ రాదు.. మేమంతా బ్యాచ్ | 10th Class Diaries Teaser | Filmibeat Telugu
  • 2 years ago
Popular Cinematographer 'Garudavega' Anji's direction debut '10th Class Diaries'. This movie teaser released by Producer C Kalyan and Cinematographer Chota K naidu. Producer C Kalyan Speech
#10thClassDiariesTeaserLaunch
#BVSRavi
#GarudavegaAnji
#Tollywood
#AvikaGor
#Himaja
#టెన్త్ క్లాస్ డైరీస్


చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్ పతాకాలపై రూపొందిన సినిమా 'టెన్త్ క్లాస్ డైరీస్'. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ 'గరుడవేగ' అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో బుధవారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు విడుదల చేశారు. సి. కళ్యాణ్ మాట్లాడుతూ "చిన్నాతో నాది 40 ఏళ్ల స్నేహం. నేను సహాయ దర్శకుడిగా ఉన్నప్పుడు అతను మ్యుజిషియన్. చిన్నా నేపథ్య సంగీతం చేయడం అనేది నాతో మొదలైంది. నేను, శివమణి, ఎస్పీ బాలు, చిన్నా... మేమంతా బ్యాచ్. సినిమా ఇండస్ట్రీలో ఒక చేతికి ఇంకో చేయి తోడైతేనే సక్సెస్ వస్తుంది. ఒక్కడితో ఎప్పుడూ సక్సెస్ రాదు. నిర్మాత అచ్యుత రామారావు తమకు ఇంకో ముగ్గురు తోడయ్యారని చెబితే సంతోషం అనిపించింది. అభినయం పరంగా సౌందర్య తర్వాత అవికా గోర్ అంటే ఇష్టం. ఆ అమ్మాయికి రావాల్సినంత సక్సెస్ రాలేదు. తనకు తప్పకుండా సక్సెస్ వస్తుంది. పనిలో అంజి చిచ్చరపిడుగు. రైటర్ దర్శకుడు అయితే... ప్రతి సీన్, డైలాగ్ మీద ప్రేమతో ఉంచుతారు. ఈ సినిమాకు అన్నీ మంచి సెంటిమెంట్స్ పడ్డాయి. మంచి హిట్టవ్వాలి" అని అన్నారు.
Recommended