KL Rahul enters in the upcoming five-Test England series | Oneindia Telugu
  • 3 years ago
KL Rahul enters in the upcoming five-Test England series on the back of a century against County XI during India’s warm-up fixture.

#INDVSENG
#KLRahul
#KLRahulcentury
#KLRahulOnTestComeback
#CountyXI
#IPL2021
#warmupfixture


ఇన్నాళ్లు టెస్ట్ క్రికెట్‌కు దూరమైనందుకు సంతోషంగానే ఉన్నానని టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ అన్నాడు. జట్టులో చోటు కోల్పోవడం వల్లే తన తప్పిదాలేంటో తెలిసాయని, ఆటగాడిగా మరింత మెరుగయ్యేందుకు అవకాశం దొరికిందన్నాడు. గత 18 నెలలుగా టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉన్న కేఎల్‌ రాహుల్‌.. ఆగష్టు 4 నుంచి ఇంగ్లండ్‌ ప్రారంభమయ్యే ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబరచి జట్టులో స్థానాన్ని పదిలం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న రాహుల్‌.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇప్పటికే కౌంటీ ఎలెవన్‌తో జరిగిన వామప్‌ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు.
Recommended