WTC Final: Team India Best Playing XI | Oneindia Telugu

  • 3 years ago
WTC Final: Predicted India’s Playing XI For ICC World Test Championship Final 2021. Team India are currently playing an intra-squad match ahead of their upcoming World Test Championship final against New Zealand. Considering the conditions which will be on offer in Southampton, let us have a look at the probable line-up that the India might come up with for the epic finale.
#WTCFinal
#TeamIndiaProbablePlayingXI
#intrasquadmatchHighlights
#TeamIndiaintrasquadgame
#IndiavsNewZealand
#RavindraJadeja
#KLRahul
#MohammedSiraj
#INDVSNZ
#ShubmanGill

ప్ర‌తిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌‌తో తుది జట్టును ఎంపిక చేయాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఫైనల్‌కు సన్నాహకంగా టీమిండియా ఆడుతున్న ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌తో టీమ్‌మేనేజ్‌మెంట్‌కు కొత్త చిక్కువచ్చి పడింది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్ సెంచరీతో మెరిశాడు. రోహిత్ శర్మ సైతం హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అటు ఇషాంత్ శర్మ మూడు వికెట్లతో మెరవగా.. సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. దాంతో తుది జట్టులో ఓపెనర్లుగా ఎవరిని ఆడించాలి? పేస్ విభాగాన్ని ఎవరితో భర్తీ చేయాలి అనేదాని టీమ్‌మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. మరోవైపు మయాంక్‌ను కూడా పరిశీలించాలని, ఇషాంత్ ప్లేస్‌లో సిరాజ్‌ను ఆడించాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. అయితే మ్యాచ్ నాటి పరిస్థితులు, న్యూజిలాండ్ బలహీనతలను దెబ్బకొట్టే వ్యూహాలకు పనికొచ్చే ఆటగాళ్లకే అవకాశం దక్కనుంది.న్యూజిలాండ్‌తో బరిలోకి దిగే భారత తుది జట్టును పరిశీలిద్దాం.

Recommended