#BharatBandh Update: కొనసాగుతున్న భారత్ బంద్... 40వేల వ్యాపార సంఘాలు, రైతు సంఘాల మద్దతు
  • 3 years ago
While The Confederation of All India Traders (CAIT) called for a Bharat Bandh on Friday, several other organisations like The All India Transporters Welfare Association (AITWA), one of the foremost apex bodies of India’s Road Transport Sector, and The Samyukta Kisan Morcha (SKM) have extended support to the call for Bandh.
#BharatBandh
#fuelpricehike
#CAIT
#SamyuktaKisanMorcha
#Farmers
#BJP
#PetrolPriceHigh


పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు, జీఎస్టీ నియమాల్లో మార్పులు, ఈ-వే బిల్లులకు నిరసనగా అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య శుక్రవారం దేశ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం పలు ప్రాంతాల్లో ఈ బంద్ ప్రభావం కనిపిస్తోంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు సంఘాలు కూడా ఈ బంద్‍కు సంఘీభావం తెలిపాయి. దేశ వ్యాప్తంగా 8 కోట్ల మందికి ప్రాతినిథ్యం వహిస్తున్న 40వేల సంఘాలు ఈ బంద్ లో పాల్గొంటున్నాయి. ఈ మేరకు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ గురువారమే ప్రకటించారు. ఈ బంద్‍‌లో లారీ యజమానుల సంఘం, అఖిల భారత రవాణా సంక్షేమ సంఘం కూడా పాల్గొంటున్నట్లు కార్మిక సంఘాలు తెలిపాయి.
Recommended